Saturday, February 22, 2020
Home > కవితలు > బ్రతుకు సమరం! -తగిరంచ నర్సింహారెడ్డి

బ్రతుకు సమరం! -తగిరంచ నర్సింహారెడ్డి

కురిపించే అనురాగం వెనుక
కాటేసే కపటచేతల ఊబీలు ..
నవ్వులనయగారం వెనుక
నిరంతరం కుటిలమెరుగులు..
క్షణక్షణం ఒలికించే ప్రేమల మాటున
కక్షగడుతూ కాలకూటనాగులు..
రంగురంగులముగ్గులనవ్వులమాటున కువ్వార్కపుతూటాలతో
నట్టింట్లోకి గురిపెట్టినAK47వాకిల్లు…
కుమ్మరించే కమ్మని బంధాల మాటున
కబళించే జిత్తులమారిఎత్తులఆత్మీయతలు…
అందమైనఅనుబంధబాహ్యప్రపంచంలో
మరింత అందమైన మేకప్పుల బ్రతుకులు ..!
అందవిహీనఅంతరంగాలెన్నో
ఓర్వలేని హానికరవిషవలయకత్తులు… !!!
కుత్తుకలు కోసే కుతంత్రం లోపల ..!
పచ్చటి జీవంపోసే అమృతమంత్రం బయట..!!

బ్రతుకునడక సక్కగసాగాలంటే
లౌక్యపుకన్నుల అడుగులు పడాలి ..!
మాయామత్తునుదునుమే
మానవతావిజ్ఞానహృదయం
నిరంతరం చైతన్యసవ్వడిచేయాలి .. !!
ఎదురై కరవనున్న విషపుతేళ్లను
చిదిమేసేలా చేతులు పరాక్రమించాలి!!
అనుక్షణం ఆచితూచి చూసే
సునిశితపరిశీలనాకన్నులు వెలుగురవ్వలవ్వాలి!!

-తగిరంచ నర్సింహారెడ్డి
9912119901

Facebook Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!