Friday, August 7, 2020
Home > కవితలు > అనుభవించమంటోంది మనసు! –

అనుభవించమంటోంది మనసు! –

అనుభవించమంటోంది మనసు
వద్దు, వద్దు అంటోంది వయసు
భువిలోకి వచ్చింది అనుభవించడానికే ననేది మనసు ఆవేదన
అనుభవించి, అనుభవించి
అనుభవాల భాదలు మోసేది నేనే నంటుంది వయసు
ప్రతి అనుభవం ఒక కొత్త అనుభూతి అన్నది మనసు
తోలి అనుభవంలోని తియ్యదనం
మలి అనుభవానికి ఎక్కడుంది అంటుంది వయసు
అనుభవించిన కొద్ది ఆనందం ఆకాశాన్ని అంటుతోంది అంటుంది మనసు
అదిక అనుభవాలతో ఆరోగ్యం అడుగంటుతోందని వయసు వాదన, ఆవేదన
ఆహారం ఎంత ఆరగించిన
పిల్లి పాలు త్రాగుట మారుచునా
అనుభవాలు యెన్ని వున్న
వయసుకు కొత్త అనుభవం చేదా
కంటికి ఇంపైన ఈ బంగారు వన్నెను
లోట్టలేసుకొని ఆరగించమంటుంది మనసు
బంగారు వన్నెను చేసి ఆవేశపడకు
ఆది ఆరోగ్యానికి హానికరం
చిన్ననాడు ముద్దు ఐన ఈ బంగారు వన్నెల జిలేబి
నేడు రద్దు ఆయెన
ఈ చెక్కర వ్యాది నాకు చుక్కలు చూపిస్తుంది
ఓ సామాన్యుని ఆవేదన

-సూదిరెడ్డి నరేందర్ రెడ్డి

Facebook Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!