Monday, February 17, 2020
Home > కవితలు > ## నూలుపోగు ## -చెన్న రాజు

## నూలుపోగు ## -చెన్న రాజు

పేరుకు నేతన్నలం
పెయుమీద బట్ట కరువైనొళ్లం
మా నరాలు దారాలుగా ఒడుకుతం
పేగులు పోగులుగా మారుస్తం
మా నెత్తురును రంగులుగా అద్దుతం
ముడితె మాసిపొయె బట్ట నేస్తం
ముడుసులు అరిగెదాక చెమట ధారవొస్తం
కళత్మకతకు కన్న బిడ్డలం
కడుపు గంజి కరువైనొళ్లం
మగ్గాలను నమ్ముకున్నందుకు
పగ్గాలతో ఉరి వోసుకునె దైన్యం
నేతన్నల పేరు మీద
ఎన్నెన్నో పథకాలు
“నేత”లకే సరిపోవట్టె..
నేతన్నల ఎతలు
ఒడువని వ్యథలు…

– చెన్న రాజు
9908010610

Facebook Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!