Monday, February 17, 2020
Home > కవితలు > నీ వెనకే నా దారి! – స్వాతీ శ్రీపాద

నీ వెనకే నా దారి! – స్వాతీ శ్రీపాద

ఏవుంది చుట్టూ చూసేందుకు
భూతద్దం పెట్టి గాలించినా గాలి జాడలు కనిపించవు
కు౦డీలలో కుదించుకున్న సముద్రాలూ
గోడలమధ్య పవళించిన హరితవనాలూ
లోలోపల కంటి కొసల్లో ఒదిగిన నదీ నదాలూ
నిర్విరామంగా పచార్లు చేస్తున్న అసంతృప్తి చారల పులులు
దుమ్మూ ధూళీ అలుముకున్న ఊపిరి సంచులు మోసుకుంటూ
ఎడారులు పరచుకున్న ఊహల ప్రవాహాలు ఈదుకుంటూ
ఎందుకులే ….
ఎప్పుడో ఈ విశాల విశ్వ వృక్షం పచ్చని గుబురుల మధ్య
ఓ కలల గూడల్లుకున్నాం,
భవితకు నగిషీలు చెక్కి ద్వారబంధాలు అమర్చుకున్నా౦
వలపు వెన్నెలలు తురుముకు వచ్చి చుట్టూ తాపడం చేసుకున్నాం
నక్షత్రాలు తు౦చుకు వచ్చి నడి నెత్తిన వెలుగులు అల౦కరి౦చుకున్నా౦
ఏవీ ఆ మయసభ వైభవాలు?
కనురెప్పపాటులో ఎటు కనుమరుగైనాయి?
గుప్పిట్లో దాచుకు ఎటు పారిపోదామని
అబ్బా ఆశ, నీ వెనకే నా దారి.

-స్వాతీ శ్రీపాద

Facebook Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!