Thursday, December 3, 2020
Home > కవితలు > ద్విపద! – ఎస్.హరగోపాల్

ద్విపద! – ఎస్.హరగోపాల్

రెండు గుండెల మధ్య దూరం
మబ్బుకు వానకు వున్నంత
బతుకురుతువులో కురుసుడొక్కటే
తెప్పరిల్లే కనురెప్పల తెప్పలమీద
కనుపాపల జంట

రెండు ఉదయాల మధ్య దూరం
ఆకాశం కనుమూసి తెరిచినంత
ఒక వెలుగు, ఒక చీకటి
గుప్పెడు గుండెలో గుప్పుమన్న
కలలపూల సుగంధం

అంత మాత్రాన సముద్రం ఇంకిపోదు
నింగిగొడుగు ముడుచుకపోదు
ఖాళీగా వుండదు మనసు
అది సముద్రాన్ని ముద్రించిన నీలిమేఘాల ఆకాశం

ఒకసారి పల్లవించడం తెలిసిన
మనిషి
మళ్ళీ మరిచిపోలేడు ప్రేమ
తెలిసి

– ఎస్.హరగోపాల్
9949498698

Facebook Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!