Wednesday, July 6, 2022
Home > కవితలు > జీవన వృక్షం! -స్వాతీ శ్రీపాద

జీవన వృక్షం! -స్వాతీ శ్రీపాద

ఓ నా మానవ జాతీ
పుట్టి౦దెలాగ మనం
ఈ సువిశాల అనంత విశ్వంలో
మనం ఒంటరి వాళ్ళమా?

ఈ సృష్టికి అర్ధం ఏమిటనే గొప్ప సందేహానికి
జవాబు వెతుకుతున్నాను
సూర్యుని డేబ్బైయ్యో వలయాన ఉన్న౦దుకేమో
నా మెదడు బరువై
నా చిన్ని నివాస ప్రప౦చ౦ ,
నా జాతి నివసించే ఒక నక్షత్రం
లక్షలాది ఏళ్ళు గడిచి లక్షలాది ఏళ్ళు
ఆచంద్రార్కం మనగలుగుతు౦ది
ఇది మానవజాతికే ఒక యుగ ప్రశ్న
అందుకే స్సృష్టికర్త సాయం అవసరం

ఆ ప్రత్యెక దినాన
కి౦ద నాధరిత్రి పైన ఎగురుతూ నేను
తెల్లమబ్బులనదిలో అదృశ్యమైన మానవ జీవి
ఎక్కడచూసినా నిశ్శబ్దం కలకలపులేమి
దివ్య తేజోమయ ప్రతిరూప౦
పైన పూర్ణ చంద్రుని అద్భుత శక్తి
నా హృదయం ద్రవి౦చి౦ది’
నా సహాయాత్రికుడు,మిత్రుడు విద్యాసాగర్
ఈ స్వర్గ ప్రదర్శనా సంరంభంలో నాతోపాటు
సౌందర్యం మా ఆత్మల్లో ప్రవేశి౦చి
మేధో శరీరాల్లో ఆనందం పరిమళి౦చి
మేం ఒంటరి వాళ్ళం కాదు
లక్షలలక్షలాది జీవాలు ఎన్ని రూపాలుగానో
పాలపుంతల గ్రహాల్లో వసంతాలవుతూ
అప్పుడు దివ్య సందేశపు ఉషోదయం.
ఆ ని౦డుపున్నమి రాత్రి నా సృష్టికర్త
దివ్య ప్రతిధ్వని
కదలిపోతూ ఒక అయోమయాన ఆశ్చర్యంతో
నాజాటినీ నన్నూ ము౦చెత్తిన ప్రతిధ్వని
“మీరు, మీ మానవజాతి నా సృష్టిలో అత్యుత్తమం
మీరంతా జీవిస్తారు, జీవిస్తారు
బాధలోనూ ఆనండంలోనూ అంతా ఏకమయే వరకు
ఇస్తూనే ఉ౦టారు, ఇస్తూనే ఉ౦టారు
నా పరవశత మీలోనే
ప్రేమ నిరంతరం
అదే కదా మానవ ధ్యేయం
జీవన వృక్షాన ప్రతి రోజు ఇదే చూస్తారు
నా అద్భుత సృష్టినుమ్ది నేర్చుకుంటూనె ఉంటారు”
అందమైన ఉదయం అది
సూర్యుడు ప్రజ్వలిస్తూ మబ్బుకు దూరానికి తరలిపోతూ
రామ చిలుకలూ కోయిలలూ
తమ సంగీత ప్రవాహాన ప్రయాణాన

మా పసుపు పచ్చని స్వర్గపు గు౦పు
ఏషియాడ్ పూలవనాన ప్రవేశించాం
అద్భుతమైన గులాబీలు
ఎరుపు తెలుపుల మేళవి౦పున
ఉదయ సూర్యునికి వందనం చేస్తూ
మెత్తని వెల్వెట్ స్పర్శ పై పదాలా౦చి
మేమంతా నడిచి నడిచి
అమాయకంగా పిల్లలు ఏకస్వరాన ఎక్కడో ధ్వనిస్తూ
వెనకన అందమైన నెమళ్ళ ప్రదర్శన

జీవన వృక్షపు అద్భుత దృశ్యం
పొడవాటి పొద్దుతిరుగుడు చెట్ల సముదాయపు తోట
సూర్యముఖులై వేలుగురేఖలకు వెరవక
ప్రతి మొక్క సజీవత తొణికిసలాడగా ఎన్ని వరసలుగానో

ప్రకృతి వింతలు ఆశ్చర్యంగా వీక్షిస్తూ
ఆ ఆనందపు వృక్షాలను మేమ౦తా సమీపించి
చుట్తో ఇసుకమీద రాలిన కి౦ది వరస పూల వలయం
మధ్యన వికసి౦చినలెక్కకు మించి పూల అద్భుతం
చుట్టూ విస్తరిస్తున్న పరిమళమూ , సౌదర్యమూ
పూల మళ్ళపై ని౦డిన తేనెటీగలు పరస్పర ప్రేమ ప్రవాహాలు
మైమరచిన దృశ్యాలు
పైకి చూపు సారిస్తే
విచ్చుకునె౦దుకు సంసిద్ధమై మొగ్గల వలయాలు
కళ్ళువిప్పే నిత్యనూతన పొరలు

మాచుట్టూ ప్రవహించే అద్భుతమైన దివ్య ప్రతిధ్వని
“పూలు వికసిస్తాయి సౌదర్యం విస్తరిస్తాయి పరిమళాలు వెదజల్లుతాయి
తీయ తేనియనందిస్తాయి .
జీవన సంధ్యలో నిశ్శబ్దంగా పూలు తమదైన నేల రాలతాయి.
ఓ నా ప్రకృతీ ఇదే మానవ జీవన ధ్యేయం
జననం, పరిత్యక్త జేవన౦
మానవజీవన వారధి జీవనధ్యేయం జీవ వృక్షం
ప్రకృతీ నా ఆశీస్సులు నీకు
ఓ నా మానవజాతీ
మనమీ సృష్టిగీతం పాడుదాం

ప్రకృతి వింతలు ఆశ్చర్యంగా వీక్షిస్తూ
ఆ ఆనందపు వృక్షాలను మేమ౦తా సమీపించి
చుట్తో ఇసుకమీద రాలిన కి౦ది వరస పూల వలయం
మధ్యన వికసి౦చినలెక్కకు మించి పూల అద్భుతం
చుట్టూ విస్తరిస్తున్న పరిమళమూ , సౌదర్యమూ
పూల మళ్ళపై ని౦డిన తేనెటీగలు పరస్పర ప్రేమ ప్రవాహాలు
మైమరచిన దృశ్యాలు
పైకి చూపు సారిస్తే
విచ్చుకునె౦దుకు సంసిద్ధమై మొగ్గల వలయాలు
కళ్ళువిప్పే నిత్యనూతన పొరలు

మాచుట్టూ ప్రవహించే అద్భుతమైన దివ్య ప్రతిధ్వని
“పూలు వికసిస్తాయి సౌదర్యం విస్తరిస్తాయి పరిమళాలు వెదజల్లుతాయి
తీయ తేనియనందిస్తాయి .
జీవన సంధ్యలో నిశ్శబ్దంగా పూలు తమదైన నేల రాలతాయి.
ఓ నా ప్రకృతీ ఇదే మానవ జీవన ధ్యేయం
జననం, పరిత్యక్త జేవన౦
మానవజీవన వారధి జీవనధ్యేయం జీవ వృక్షం
ప్రకృతీ నా ఆశీస్సులు నీకు

ఓ నా మానవజాతీ
మనమీ సృష్టిగీతం పాడుదాం!

-స్వాతీ శ్రీపాద

Translated from
THE LIFE TREE
Abdul Kalam Azad
(Composed in celebration of Human Life)

Facebook Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!