Wednesday, October 17, 2018
Home > కవితలు > ఈ అత్భుతమైన పేయింటింగ్ కి కవిత వ్రాయగలరా..?

ఈ అత్భుతమైన పేయింటింగ్ కి కవిత వ్రాయగలరా..?

ఈ పడతి పసిడి వన్నెల కాంతితో
సరితూగలేనన్న శంఖ తో కాబోలు
ఈరేయి రేరాజు కానరానన్నాడు

ఔరా!!! ఏమి ఈ అందాల సౌందర్యము

ఆకోమలీ కురులు జాలువారుచు నుండ
నలుపు జలపాతమా, అది ఏమి చిత్రమా
అనుచు చూచిన మనసు అచ్చరువు నొందే

ఔరా!!! ఏమి ఈ అందాల సౌందర్యము.

కలువ పవ్వులె కాదు ఆకులూ ఆశగా
ప్రతిబింబమే కనిపించు నని తలచి
ఎదురు చూచుచునుండె కనురెప్ప పాటుకై …

ఔరా!!! ఏమి ఈ అందాల సౌందర్యము .

-యం రాంప్రసాద్ రావు

****************************************
ఓ నవనవోన్మేష పూలతాంతికా !
కొనగోట మీటినా రాగాలు పలికే రసరంజనీ !
చూపుల చల్లదనాల
లలిత పల్లవాలు పలికించే రమ్యలహరీ !
హృదయవనం దగ్ధమై పోతుంది
నీ కోసం !
ఇలా చేశావేమిటీ ?
ఆకలి కోసం కాదు
నేను బతికింది
అందమైన నీ కోసమని
తెలిసి ఎలా గడపడం !

-సబ్బని లక్ష్మి నారాయణ

******************************************
కలువ కొలనులో అరమోడ్పు కనులతో
కవ్విస్తున్న నవ జవ్వనీ ….
నీ వాలు చూపు నా పైన
వాల్చవేమే
ఓ మారు కన్నెత్తి ఇటు చూడు
కొలను గట్టున
కనిపించని విరహ వేదనతో
వేదన పడుతూ
నీ లో నింపుకున్న చంద్రకాంతి
నా మీద ఎప్పుడు ప్రవహింపజేస్తావోన ని
వాడి న కలువనై ఎదురుచూస్తున్నాను…..
వికసించి నీ వెలుగు నాలో నింపుకుందామని

-నాగరాజ్ వాసం

Facebook Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!