గెలుపోటములు
నన్ను ముళ్లుగర్రతో
పరుగులు పెట్టిస్తాయి
నిముషం నిలబడనీయవు
క్షణం వూపిరి తీసుకొనివ్వవు
అప్పుడు నేనేం చేస్తాను
కేంద్రకాన్నవుతాను నాకు నేనే వృత్తాన్నీ అవుతాను
నా చుట్టూ నేనే తిరుగుతూ వుంటాను
చిన్న మెట్టెక్కి మబ్బుల్లో తేలిపోతాను
చిరు గాలికే రేప రేప లాడి పోతాను
కలవరింపులూ పలవరింతలూ
ఉచ్వాస నిశ్వాసాల్లో కలె గలిసి పోతాయి
నిటారుగా నిదానంగా సాగే జీవన రేఖ
అప్పుడప్పుడూ వంకర్లు పోతుంది
తమాయించుకోవడం తెల్వకుంటే
చిన్న పోట్రాయీ బొక్క బోర్లా పడేస్తుంది
నిభాయించుకోవడం నేర్వకుంటే
చిన్న గుమ్మమూ తలకు బొప్పి కట్టిస్తుంది
సముయిద్రపు అల
ఎగరడమూ కూలిపోవడమూ
శ్వాసంత నిజం
కాలమంత సహజం
పడి లేవడమే ధీరత్వం
ప్రవహించడమే బతుక్కి
దాఖలా
-వారాల ఆనంద్
9440501281
Facebook Comments
Mee kavithalo nannu nenu chesukunnattu. vundhi…………