Saturday, February 22, 2020
Home > కవితలు > ! ఒంటరితనపు వంతెనలపై ! -పుష్యమి సాగర్

! ఒంటరితనపు వంతెనలపై ! -పుష్యమి సాగర్

! ఒంటరితనపు వంతెనలపై !
నిశ్శబ్దం ఎంత బాగుందో
మనసు ముక్కలైనప్పుడో, మనవాడు
దూరమై కన్నీళ్లు పెడుతున్నప్పుడో
అలవి కానీ నిర్వేదం
గజి బిజి ప్రపంచంలో నన్ను గా
ప్రేమించని మనిషి ని సంపాదించనప్పుడు
సంపదలెన్ని ఉన్నా ఏమి లాభం!
ఒంటరి వంతెనలపై అడుగులు
తడబడి అందరు ఉన్నా ఏమిలేనితనం తో
కునారిల్లుతున్నప్పుడు
జీవం లేని నవ్వు పెదాలపై
ఆత్మవంచన ఎందుకు ?
ఎన్ని కలలని భద్రం గా
కళ్ళలో దాచానో, అనుకోని ఉపద్రవం వొచ్చి
ముక్కలైనప్పుడు
ఒంటరి గా కన్నీటి చెలమల్లో
కొట్టుకుపోతున్నాను
మనుషులు వెలిసిన ప్రతీసారి
నేను ఉన్నా అంటూ
నిశ్శబ్దం మౌనం గా వెన్ను తట్టి
అక్కున చేర్చుకుంది ..
ఒంటరితనం వీధి మలుపులో
చివరి మైలు రాయిని
జీవితం ముగిసే వరకు
ఇలాగే పాతుకు పోనీ..!

-పుష్యమి సాగర్

Facebook Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!