Thursday, December 3, 2020
Home > కవితలు > బ్రహ్మజెముడు! -స్వాతీ శ్రీపాద(కె. సచ్చిదానందన్ మళయాళ కవిత)

బ్రహ్మజెముడు! -స్వాతీ శ్రీపాద(కె. సచ్చిదానందన్ మళయాళ కవిత)

ముళ్ళు నా భాష
స్రవించే రక్తపు స్పర్శతో
నా ఉనికిని ప్రకటిస్తాను

ఒకప్పుడీ ముళ్ళు మెత్తని సుమాలు
మోసగించిన ప్రేమికుల౦తే రోతనాకు
కవులు ఉద్యాన వనాలకు తిరిగి వెళ్ళడం
కోసం ఎడారులను వదిలేసారు
ఇక్కడ ఒంటెలు, నాపూలపై నడిచి దుమ్ము
మిగిల్చిన వ్యాపారులే ఉన్నారిక్కడ

అపురూపమైన ప్రతి నీటి చుక్కకూ
ఒక ముల్లు
సీతాకోక చిలుకలను ప్రేరేపి౦చను నేను
ఏ పక్షీ నన్ను పొగుడుతూ పాడదు
కరువుల కస్సలు లొ౦గి పోను

నేను మరో సౌందర్యాన్ని సృష్టిస్తాను
ఆ వెన్నెల కావల
కాలాలకు ఈ వైపున
పదునైన, గుచ్చుకునే
సమాంతర భాష

-స్వాతీ శ్రీపాద

Facebook Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!