రెపరెపలాడుతు ఎగిరే
మన జెండాను చూడరా
మహనీయుల నిస్వార్థపు త్యాగాల ఫలం
మన స్వతంత్ర భారతం
అని మరువకురా..
అవినీతి అలసత్వం అవనినేలుతుంటే
అమరజీవుల ఆత్మలన్నీ సిగ్గుతో రోదిస్తున్నవిరా…
అహింస అసత్యం ఆయుధమై సాధించిన స్వతంత్రం
అడుగడుగన హింస స్వార్థం చూస్తూ అలసిపోతోందిరా..
పరమత సహనం అంటూ అందరమొకటే అంటూ సమ సమాజం కోసం కలలు కన్న స్వతంత్రం..
కులానికో సంఘం చూసి కుంచించుకుపోతోందిరా..
బానిస సంకెళ్ళు తెంపి.. బ్రిటిష్ వారినెళ్ళగొట్టి.. స్వేచ్ఛా ఊపిరులిచ్చిన సమర యోధులాత్మలన్నీ..
స్వేచ్ఛకి అర్థం తెలియని భావి భారత పౌరుల చూసి ఘోషపడుతున్నవిరా..
కళ్ళు తెరచి చూడరా కన్న తల్లి భారతిని
కమ్మని కల కంటోంది కన్న బిడ్డల భవితకై
ఎందరో యోధుల త్యాగం ఎదను నింపుకుందాం
ఎదుటనున్న అలసత్వాన్నెదిరిద్దాం
ఎంచలేని ఎదురులేని నవ భారతాన్ని నిర్మిద్దాం.. జైహింద్
~ఫణి మాధవి కన్నోజు~
భాస్కర్ క్లినిక్, జహీర్ పుర, ఖమ్మం.