Monday, February 17, 2020
Home > కవితలు > ||విద్యార్థి-యుద్ధం|| -ఫణి మాధవి కన్నోజు

||విద్యార్థి-యుద్ధం|| -ఫణి మాధవి కన్నోజు

నేనొక విద్యార్థిని..
చేస్తున్నా యుద్ధం..

కూలి నాలి చేసుకుంటు
కూడు పెట్టి బడికి పంపె
అమ్మ కంట… ఆనందపు నీటి చెమ్మ
చూడాలని ఆశతో…

బడుగు బతుకునీడుస్తూ
బక్కచిక్కిన నాన్న.. ఎద
గర్వంతో పొంగాలని కాంక్షతో..

మా పేదరికపు సంద్రాన్ని
తోడి పారబోయాలని
అక్షరాల రాళ్ళు విసిరి పూడ్చివేయాలని

కమ్ముకున్న నిశీధిని పారద్రోలాలని
అక్షరాల వెలుగుల్లో దారి వెతుక్కోవాలని

మదిని నిండిన వెతలు
మరుగున పరచాలని
పుస్తకాల చెట్టు నీడ సేద తీరాలని

ఆర్థిక అసమానతలకి ఎదురీది
అతుకుబొతుకుల బతుకు..
బాగు చేసుకోవాలని..

చదువొక్కటే బంగరు భవితనిస్తుందని
అక్షరాల ఆయుధంతో చేస్తున్నా యుద్ధం.

~ ఫణి మాధవి కన్నోజు ~

Facebook Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!