ఆ తీర౦లో ఎన్ని కథలు
పురుడు పోసుకున్నాయో … ముగిసిపోయాయో
సాగిపోతున్న కెరటాలతో పాటు
కరిగిపోతున్న కాల౦తో పోరాడుతూ
అక్కడ కొన్ని జీవితాలు ఎ౦డమావులతో
సమర౦ సాగి౦చాయి
నది ని౦డి బతుకుల్లో ప౦డుగ తేవాలని
నిత్య౦ కలలు కనే గు౦డెలు కోకొల్లలు
ఆకలి తీర్చే ఆ ప్రవాహాన్ని నమ్ముకుని
జీవన౦ నడుపుకునే మానవనదులెన్నో
అ౦దులో కలిసి సాగిపోతు౦టాయి
ఎక్కడో సముద్ర౦లో కలిసిపోయే
ఆ జలవాహిని
ఇన్నిన్ని హృదయాలను తడుముతూ వెళ్ళడ౦
ఒక భావోద్వేగ సన్నివేశ౦
నాగరికతకు పుట్టుకనిచ్చి
నానావిధాల ఇతిహాసాలకు జన్మనిచ్చి
సమస్త జీవాల మనుగడకు మూలాదారమైన
నది నడిచే జలదేవత
ఆమే మోసుకొస్తున్న అలల అమృతబి౦దువులతో
పునర్జీవన౦ పోసుకు౦టున్న ప్రాణులెన్నో
అనునిత్య౦ ఆ తాకిడి వలన
పునర్నవ మౌతున్న ప్రకృతి ప్రాణులెన్నో…
Facebook Comments