మర్చిపోవడం అలవాటయిన వాడికి
గుర్తుంచుకోవడంలోని
మాధుర్యాన్ని ఎట్లా చెప్పడం
మదనపడ్డవో, సంబ్రపడ్డవో
అనుభవాలు
మరుపు పొరల్లో
మబ్బుల చాటు చుక్కల్లా
మినుకు మినుకు మంటాయి
‘మరుపు ‘
సరళ రేఖ లాంటి దారి కాదు
మలుపులూ, మరుగులూ వుంటాయి
దారిపొడుగునా
‘కన్నీటి జాతర’ లుంటాయి
మంచివో చెడ్డవో
అనుభవాలు ‘జ్ఞాపకాలుగా’
తడుముతూ వుంటాయి
బతుకు భూమిలో వేర్లయి
నిలబెడుతూ వుంటాయి
మర్చిపోవడం అలవాటయినా
గమనం
గుర్తుంచుకోవడం లోనే
-వారాల ఆనంద్
Facebook Comments
బాగుంది సార్ గమనం
మదనగమనమే గుర్తుజ్ఞాపకాలుగా జీవనం….