Monday, February 17, 2020
Home > కవితలు > ||మనోమస్తిస్కాలు|| -నాగరాజ్ వాసం

||మనోమస్తిస్కాలు|| -నాగరాజ్ వాసం

మస్తిష్కానికి హృదయానికి పొసగదెప్పుడు
హృదయం నిండా నింగిని తాకాలని
ఎగిరే కెరటాలే
అవెప్పటికి నింగిని తాకలేవని
వెక్కిరించే నిరాశా పురుగు మెదడు

తుఫాను గాలికి ఎదురీదే పక్షి…., మనసు
ఆ రెక్కల శక్తిని వెనక్కి లాగే
మిత్రద్రోహి మెదడు

మనోమస్తిస్కాల వైరాన్ని సమన్వయ పరిచే
చుక్కానినై నేను…..
జీవిత నౌకా ప్రయాణం లో
ఆటు పోటుల అల ల కళ్ళోలా లను
సమన్వయ పరుస్తూ
మనసు తో మస్తిష్కానికి…..
మస్తిష్కం తో మనసుకు కళ్ళెం వేస్తూ
జీవ సముద్ర తీరాలు చేర ,
పోరాటం చేస్తున్న నేను….

-నాగరాజ్ వాసం

Facebook Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!