నిరంతరం
యుద్ధం చేస్తున్నాను
నాలో నేను
నాతోనే నేను
ఓసారి
మనస్సును గెలిపిస్తూ..
మరోసారి
బుద్ధికి కి సపోర్ట్ చేస్తూ..!
బుద్ధికి ఎప్పుడూ విచారమే
మనసు ఎందుకు మారదని..?!
మనసుకెప్పుడూ కోపమే
ఈ బుద్ధి ఎప్పుడూ ఎదగనీయదని..!
మనసు
గెలిచిన ప్రతిసారీ
నలుగురిలో మమేకమై
తలలో నాలుకలా
కలిసిపోతుంది..!
ఓడిన ప్రతిసారీ
అందరినీ వొదిలేసి
నాలుగు గోడల మధ్య
కృంగి పోతుంది.
ఇదిగో ఇప్పుడే..
మనసును సముదాయించి
బుద్దిని గెలిపిస్తుంటాను.
గెలుపోటములు సహజమని
నిరంతరం పోరాడమని.
-అక్షర్ సాహి
Facebook Comments