Wednesday, June 3, 2020
Home > కవితలు > || కృతజ్ఞతా సుమధుర సౌరభం|| -గంజాం భ్రమరాంబ

|| కృతజ్ఞతా సుమధుర సౌరభం|| -గంజాం భ్రమరాంబ

పుడమి తల్లి హృదయాన్ని
కుదిపివేసేటట్లు..

చెట్లను నరికేసి ఇళ్లు వెలుస్తుంటే
చెరువులు ఆక్రమించి కాలనీలు కడుతుంటే
పంటపొలాల స్థానంలో అపార్ట్మెంట్
మొలుచుకొస్తుంటే
అడుగడుక్కీ ఒక బోరింగ్ రంధ్రమై
తొలిచేస్తుంటే
పంట త్వరగా చేతికిరావాలనీ
కాయలు అతిత్వరగా పండిపోవాలని
రసాయనాలు ఎడాపెడా వాడేస్తుంటే
త్వరగా భూమిలో కలిసిపోలేని
ప్లాస్టిక్ వ్యర్థాలను
విచక్షణా రహితంగా విసిరేస్తుంటే

పుడమి తల్లి హృదయం గాయపడి
కోపంతో భూగోళం వేడెక్కితే
భూమి బాధను అర్థం చేసుకున్న
ఒక నీలిమేఘం నిలువునా కరిగి
ధరణిని ఓదార్పుగా తాకి ముద్దాడితే
భూమి వెదజల్లే సువాసనా పరిమళం
ఉవ్వెత్తున లేచింది
మట్టివాసనా…కాదు కాదు..అది
కృతజ్ఞతా సుమధుర సౌరభం

-గంజాం భ్రమరాంబ

Facebook Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!