Thursday, July 9, 2020
Home > కవితలు > || సత్యమేవ జయతే || -యరకల యాదయ్య

|| సత్యమేవ జయతే || -యరకల యాదయ్య

సత్యమేవ జయతే
ధర్మమేవ జయతే
అది ఒకనాటి మాట
మనుషులు లేని యుగం
మరణం లేని యుగం
దేవతా మూర్తుల అమరత్వం
కృతాయుగం కాలం నాటిమాట

ఒకే భార్య ,ఒకటే మాట
ఒకటే బాణం, తండ్రి మాట
జవదాటని కాలం
రామాయణం కథలోని
త్రేతాయుగం కాలం నాటిమాట.

దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కై ఆడిన
ఓ ఆట
ఆధిపత్యం, అహంకార వధ పక్షపాతి, స్వార్ధ చింతన
అధర్మంతో, ధర్మాన్నే జయించిన
మహా భారత ఇతిహాసం.

కష్టేఫలి అని కలియుగం ఆదిలో
ధర్మ సూక్తిగా సృష్టించుకొన్న ఆపదం
అధికారపు, అరాచకాల
ఉక్కుపాదాల అడుగున
నీతి, క్రమాలు నలిగి
అవినీతి, అక్రమాలుగ మారి
అధర్మమే, ధర్మంగా మారి
అపద్దపు మాటలతో
సత్యాన్నే వధించి
మోసపూరిత వంచన కు
శ్రమకు విలువలేక
కుతంత్రాల, కుయుక్తుల
మాటల క్రీనీడలు
మన వెంటనే పయనిస్తూ
మనని వదలనంటున్నాయ్.

మనమెంత ఎదిగిన
మార్పులెన్ని జరిగిన
మనసుకు ధర్మమేవ
మాటకు సత్యమేవ
ఎప్పటికప్పుడు
ఆమడ దూరమే
ఈ కలి యుగంలో
కను తెరచిన కాంచి
కనుమూసేవరకు
కంటూనే ఉన్న వింటూనే ఉన్న
సత్యమేవ జయతే
ధర్మమేవ జయతే.

-యరకల యాదయ్య.

Facebook Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!