Saturday, May 30, 2020
Home > కవితలు > ||వెన్నెలంతా ముద్దగజేసి|| -గొల్లపెల్లి రాంకిషన్ (రాఖీ)

||వెన్నెలంతా ముద్దగజేసి|| -గొల్లపెల్లి రాంకిషన్ (రాఖీ)

వెన్నెలంతా ముద్దగజేసి
నింగి సింగిడి రంగులనద్ది
మంచుకొండను గుండెగజేసి
మమతలెన్నో మనసున కూర్చి
నిన్ను సృష్టి చేసినాడు ఆబ్రహ్మా
చేసిచేయగానె ధన్యుడాయె నోయమ్మా

మేఘాలే కురులుగ మారే
కమలాలే కన్నుల చేరే
ముక్కుజేరర ముక్కెర కోరే
పగడాలే పెదవుల రాలే
రోజాలే చంపలపూసే
చుబుకం తీరు లేతకొబ్బరే

నువ్వు నవ్వు నవ్వగానె ఓయమ్మా
మాయలేవొ కమ్ము నమ్ము నమ్మవమ్మా

కుంభరాశి ఎద తులతూగె
సింహరాశి కటిలో నిలిచే
కన్యారాశి నాభిలొ మెరిసె
మిథునరాశి మతిపోగొట్టె
వృషభమేమొ జఘనమ్మాయే
మేను మేను మీనమాయే

నీ నడకల హొయలేచూస్తె ఓ కొమ్మా
హంస ఘనత ధ్వంసమగునులే
ఓ గుమ్మా

-గొల్లపెల్లి రాంకిషన్ (రాఖీ)
9849693324

Facebook Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!