Monday, August 8, 2022
Home > కథలు > బొజ్జ గణపయ్య- భూలోక యాత్ర! -అక్షర్ సాహి

బొజ్జ గణపయ్య- భూలోక యాత్ర! -అక్షర్ సాహి

“స్వామి.. మహా గణపతి..! మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ అఫ్ ది డే!”

“థాంక్యూ మూషికా.! ఏమిటి సంగతి పొద్దున్నే ఇంగ్లీష్ లో..”

“ఏంలేదు స్వామీ ఈరోజు మనం భూలోకం వెళ్తున్నాం కదా అక్కడ అన్ని భాషలు మాట్లాడాలి కదా. అందరికి ఆమోదయోగ్యం అయిన ఇంగ్లీష్ వాడకం ఎక్కువ కదా అందుకే ప్రాక్టీస్ చేస్తున్నా..”

“సరే సరే అన్ని సరిగ్గా సర్దిపెట్టు. పోయిన సారి తీస్కువచ్చిన వస్తువులెవ్వి పెట్టకు. అన్ని భూలోకంలోనే తీసుకుందాం”.

“అలాగే స్వామి. అమెజాన్ లో లేదా ఫ్లిప్ కార్ట్ లో ఆర్డర్ చేద్దాం అనుకున్న కానీ ఇక్కడికి కొరియర్ సర్వీస్ లేదు కదా అందుకే చేయలేదు.”

“సరే త్వరగా కానివ్వు.. దేవతలందరు సెండ్ ఆఫ్ ఇవ్వడానికి వస్తున్నారు. కేక్ కటింగ్ అయిన తర్వాత వెంటనే బయలుదేరాలి. అసలే వర్షం వచ్చే సూచనలున్నాయి.”

“అలాగే స్వామి!”

“నాయన గణేశా! ఇదిగో నీ బ్యాగు అన్ని దీనిలో ఉన్నాయి. చాలా జాగ్రత్త తండ్రి. వేళకి భోజనం చెయ్యి. నీ భక్తులు ఆభజన ఈ భజన అని అర్ద రాత్రి వరకు మేలుకుంటారు. నీకూ ఇష్టమే అనుకో.. కానీ ఆరోగ్యం జాగ్రత్త. అక్కడ రెస్టారెంట్లలోనే కాదు ఇండ్లల్లో కూడా అంతా కల్తీ సరుకు సప్లై చేస్తున్నారట. చుస్కో నాయనా!”

“అబ్బా మమ్మీ..! నాకు తెలుసు కదా! ప్రతి సంవత్సరం వెళ్తా కదా డోంట్ వర్రీ..!”

“నా పుట్టిన రోజు నన్ను ఆశీర్వదించడానికి వచ్చిన బంధుమిత్రులకు, పూజ్య దేవతలకు శతకోటి వందనములు. ఇహ నాకు సెలవిస్తే… నేను భూలోకంలో విహరించుటకు బయలు దేరుతాను.. అక్కడ నా పుట్టిన రోజు సంబురాలు చాలా ఘానంగా చేస్తున్నట్టు తెలిసింది. నా భక్తులు రెడ్ కార్పెట్ వేసి ఎదురు చూస్తున్నారు”.

“అలాగే గణేశా! నీ ఆనందం కంటే మాకందరికీ కావలసిందేముంది? క్షేమంగా వెళ్ళిరా నాయనా!”

“ఓకే డాడీ!”

“బాబు గణేశ్..! అల్ ది బెస్ట్.. హాలిడేస్ బాగా ఎంజాయ్ చేసి రా..! అన్నట్టు కరెన్సీ కన్వెర్ట్ చేస్కున్నావా? మన వజ్ర వైడుర్యాలకు సరిపడా చిల్లర అక్కడ దొరక్కపోవచ్చు.. అందుకే వెళ్తూ వెళ్తూ కుబేర అంకుల్ దగ్గర డబ్బు తీసుకుని వెళ్లు. భూలోకం చేరగానే ఒక మంచి స్మార్ట్ ఫోన్ కొను ఎందుకంటే ఎంత మనది ఓపెన్ నెట్ వర్క్ అయినా వాయిస్ క్లారిటీ ఉండట్లేదు అసలే క్లౌడి గా ఉంది. అందుకే మనమూ మనుషులు కనిపెట్టిన శాటిలైట్ నే నమ్ముకోవాల్సి వస్తుంది”.

“అలాగే అంకుల్! అంతా మీ మాయే కదా విష్ణు మాయ!”

“బై టాటా.. టేక్ కేర్”

“ బై…బై..”

టిక్.. టిక్.. టిక్.. “ఎవరూ…”

“కుబేర్ అంకుల్ నేను గణేశ్”

“ఆ గణేశ్ రా.. నీకోసమే చూస్తున్న.. పుట్టిన రోజు శుభాకాంక్షలు.. విష్ణువు చెప్పాడు నువ్వు వస్తావని డబ్బులు సద్దమని. ఇవిగో తీసుకో… ఇవి మళ్ళీ నాకు తిరిగివ్వనక్కర్లేదు..”

“ఎందుకు అంకుల్..?”

“ఎందుకు బాబు తిరిగివ్వడం? ఒక్కసారి ఎంకన్నకు ఇచ్చి తిరిగివ్వమన్నందుకు నేను రోజూ తిరుగుతూనే ఉన్నా. ఈ మధ్య నా పరిస్థితి మరీ ఘోరంగా తయారయింది. ఆ మోడీ పుణ్యమా అని వెయ్యినోటు, 500 ల నోట్లు బ్యాన్ చేశారు.
దొంగ నోట్లు, బ్లాక్ మనీ అంతా తీసుకొచ్చి తిరుపతి హుండీ లో వేశారు. అదంతా మోయలేక ప్రాణం పోయే పరిస్థితి వచ్చినట్లయ్యింది. సరే జనాలందరూ సేవ్ అవడానికి నాకు అంటకట్టారు కానీ ఇప్పటి దాక.. ఇన్ని సంవత్సరాల నుండి నేను కూడపెట్టిన నోట్ల సంగతేంటి? అవి చెల్లని చిత్తు కాగితాలే అయినవి కదా నా శ్రమంతా వేస్ట్ కదా..! అందుకే బాబు నాకేం ఇవ్వొద్దు… ఇది నీ బర్త్ డే గిఫ్ట్ అనుకో..!

అంతా మాయ విష్ణు మాయ!”

“కాదంకుల్ మోడీ మాయ..! థాంక్యూ వస్తా బై

మూషికా…! దౌడ్.. చలో భూలోకం!”

(ఇంకా ఉంది )

మిగితా పార్ట్ www.telangana4u.com సాహిత్యం పేజీ లో
Part 2
Part 3
Part 4
Part 5

-అక్షర్ సాహి
aksharsahi@gmail.com

Facebook Comments

3 thoughts on “బొజ్జ గణపయ్య- భూలోక యాత్ర! -అక్షర్ సాహి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!