Wednesday, June 3, 2020
Home > పుస్తక పరిచయం > ” సడి లేని అడుగులు ” విశ్వకవి రవీంద్రుని ‘గీతాంజలి’కీ ఆచార్య మసన చెన్నప్ప గారి సరళ సుందర అనువాదం. – సబ్బని లక్ష్మీనారాయణ

” సడి లేని అడుగులు ” విశ్వకవి రవీంద్రుని ‘గీతాంజలి’కీ ఆచార్య మసన చెన్నప్ప గారి సరళ సుందర అనువాదం. – సబ్బని లక్ష్మీనారాయణ

విశ్వకవి రవీంద్రునికి నోబెల్ బహుమతి తెచ్చిపెట్టిన ‘గీతాంజలి’ ని సరళ సుందరంగా తెలుగులోకి అనువదించారు ఆచార్య మసన చెన్నప్ప గారు.

కవిత్వమంటే హృదయాల భాష , కవిత్వమంటే మార్మికత, తాత్వికత, దార్శనికత. అలాంటి లక్షణాలని పునికి పుచ్చుకొని ప్రకృతి సౌంధర్యాలను, రహస్యాలను ఇనుమడింప జేసుకున్న కవిత్వం అజరామమై వర్ధిల్లుతుంది. అలాంటిదే రవీంద్రుని కవిత్వం. రవీంద్రుని కవిత్వం ఒక నివేదన, ఒక అనుసంధానం భక్తునికి, భగవంతునికి.

ఆ కవితాభావాలను అంతే సహజంగా, సులభంగా , చిన్నచిన్న కవితామృత గుళికలుగా మనకు అందించారు చెన్నప్ప గారు.

మసన చెన్నప్ప గారు వేదాలను అధ్యనం చెసి జీర్నించుకున్నవారు. సంస్కృతాంధ్ర భాషల్లో పండితులు. అలాంటి వారి కలం నుండి రవీంద్రుని గీతాంజలి తెలుగులోకి సరళ సుందరంగా తెలుగులోకి అనువాదం కావడం విశేషం. “మూలకర్త అనుభూతిని స్వీయానుభూతిగా మార్చుకున్నప్పుడే అనువాదం రాణిస్తుంది. నేను అలాంటి ప్రయత్నమే చేశాను. తత్ఫలితమే ఈ ‘సడిలేని అడుగులు’ అన్నారు ముందు మాటలో చెన్నప్ప గారు.

ఇంకా “రవీంద్రుని గీతాంజలిలో ఉన్నవి కేవలం మాటలూ , పాటలూ కావు , దేవునితో జీవుని అనుభందం, దేవునితో జీవుని అనుబంధం, దేవుని కోసం జీవుని ఆరాటం. ఈశ్వరున్ని సాక్షత్కరించుకొని తీరగలననే భరోసాను కల్గిస్తున్న మహత్తర రచన గీతాంజలి. ఈశ్వరుదు మన వెన్నంటే నడుస్తున్నాడు. కాని అతని అడుగుల చప్పుడు మనం వినలేకపోతున్నాం. కనుకనే బాగా ఆలోచించి ఈ అనువాదానికి ‘సడిలేని అడుగులు’ అని నామకరణం చేశాను.” అన్నారు.

ముందు మాటలు కాక 86 పేజీలున్న ఈ పుస్తకంలో మొత్తం 103 అనువాద కవితాఖండికలున్నాయి. దేనికదే నిత్య నూతనంగా కనిపిస్తుంది ఎప్పుడూ చదివినా. వారు ‘గీతాంజలి ‘కి ఈ అనువాదాన్ని లఘుకవితారూపం అన్నారు. సులభంగా, సరళంగా గీతాంజలి కవితల్లోని సారాన్నంత పిండి లఘుకవితల్లోనే మనకు అందించారు చెన్నప్పగారు. అదే ఈ పుస్తకం యొక్క విశేషం.

మచ్చుకు రవీంద్రుని బాగా ప్రసిద్ధమైన “ Where the Mind is Without Fear “గీతానికి వారి అనువాదం ఇలా ఉంది హృద్యంగా .

ఎక్కడ

నా మనస్సు నిర్భయంగా వుంటుందో

అక్కడ

నా దేశాన్ని నిలుపు.

ఎక్కడ మనుషులు

తలెత్తుక తిరుగుతారో

అక్కడ

నా దేశాన్ని నిలుపు

ఎక్కడ జ్ఞ్యానం

విరాజిల్లుతుందో

అక్కడ

నా దేశాన్ని నిలుపు

గోడలు, గొడవలు లేని

ప్రపంచం మధ్య

దేవా !

నా దేశాన్ని నిలుపు.

ఎక్కడ

వేదవాణి వినిపిస్తుందో

అక్కడ

నా దేశాన్ని నిలుపు

ఎక్కడ

శ్రమ శక్తి గెలుస్తుందో

అక్కడ

నా దేశాన్ని నిలుపు !

మరింకో రవీంద్రుని ప్రసిద్ధమైన “ LEAVE THIS CHANTING “ అనే గీతానికి చెన్నప్ప గారి అనువాదం ఇలా ఉంది.

ఈ గుడిలో

కళ్ళు మూసుకుంటావెందుకు ?

జపతపాలా

పరమాత్మను పట్టిచ్చేవి ?

ఎక్కడ

రైతు దున్నుతాడో

కూలి రాళ్ళు కొడుతాడో

అక్కడే దేవుడి బస !

దేవుడుండేది

ఎండవానల్లో తిరిగే వాళ్ళ మధ్య

నువ్వు

మడికట్టుకుంటే ఎట్లా?

సృష్టికి , మనకూ

మనకూ, తనకూ తెగని బంధం !

ఇంకా

మోక్షమెక్కడిది ?

పూజలోంచి. ధ్యానంలోంచి

బయటికిరా

చెమటతో

అతని పక్కనే నిలువు !

ఇలా చెన్నప్ప గారి ‘గీతాంజలి’ అనువాదం అందరికీ సులభ గ్రాహ్యంగా ఉంది. గీతాంజలి ప్రియులెవరైనా, కవిత్వ ప్రియులెవరైనా చదువవలసిన మంచి పుస్తకం ఇది. గీతాంజలికి లఘుకవితారూపంలో మంచి అనువాదం అందించిన మసన చెన్నప్ప గారికి హృదయ పూర్వక అభినందనలు.

-Sabbani Laxminarayana

Cell: 9247270941

పుస్తక ప్రాప్తి స్థానం:
“సడిలేని అడుగులు”
Masana Chennappa.
వెల : Rs.80/-
Prameela prachuranalu
9-76/2, Udaynagar colony,
Boduppal, Hyderabad.-39.
Cell: 9885654381

Facebook Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!