Friday, November 22, 2019
Home > కవితలు > || ఆపకు నీ ప్రయాణం || -సతీష్ కుమార్ బోట్ల

|| ఆపకు నీ ప్రయాణం || -సతీష్ కుమార్ బోట్ల

 

కలత రేపిన ఆలోచనల అంతర్మధనం లో

కనులు చూపిన కలల శోధనలో

ఆనుబంధాల ఆశృ జల్లులతో

ఆర్పేయకు నీ ఆశయ దీపాలు

ఆత్మీయుల ఆకాంక్షల కోసం                             

అడ్డుకోకు నీ విజయ సోపానాలు

 

కన్నీళ్ళకు దొరికిపోయేది

కామానికి కరిగి పోయేది

కాలాతితమైన ప్రేమ కాలేదు

ఆవకశాలకు పొంగిపోయేది

ఆశలు చూపిస్తే లొంగి పోయేది

అవిరామ పోరాటం కాలేదు

అనుబంధాల ఊభిలో కురుకుపోతే

అందాల/ ఆనందాల  వలలో చిక్కుకు పోతే

ఆశయా సాధనలో అలుపెరుగని ప్రయాణం చేయలేవు

 

కారుణ్యతని వొలకబోస్తే  

కన్నీరే కడలై  నిన్ను ముంచేస్తూoది

పట్టు విడుపుల మంత్రాన్ని జపిస్తే

పట్టాలు తప్పే ప్రయాణమై నీ జీవితాన్ని కుల్చేస్తుంది

 

అందాల / ఆనందాల బంధాల్లో

అనుబంధాల  బంధనాలలో

కాలం ఎప్పుడు కఠినమైనదే

ప్రయాణం ఎప్పుడు జఠిలమైనదే

 

 

 

చీకటి వెలుగుల సంగమం లో

గెలుపోటముల ఆలింగనంలో

నిశిది నీడలను చిలుస్తూ

వెలుగు జాడలను పరుస్తూ

ఆశయం తో కరచలనo చేసేవరకు

ఆపకు నీ పోరాటం

ఆఖరి మజిలి చేరేవరకు

ఆపకు నీ అలుపెరగని ప్రయాణం.

 

-సతీష్ కుమార్ బోట్ల

బొట్లవనపర్తి

9985960614

Facebook Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!