Monday, February 17, 2020
Home > కవితలు > ||సంగమం || -సబ్బని లక్ష్మీనారాయణ

||సంగమం || -సబ్బని లక్ష్మీనారాయణ

అనురాగం, ఆత్మీయత కలిమిలేముల కలయికలో
ఎదిగి వచ్చాం మూడు సంవత్సరాలు
అటు ఇటు తప్పక నేడు విడిపోక తప్పదేమో
అనంత స్నేహవారధిలో నా చుట్టూ నా స్నేహితులంటూ
సత్యం తో ప్రారంభించి అనంతత్వం లోకి వెళ్ళిపోవాలని
వ్రాస్తున్నానొక కవిత
ఒకే ఒక ‘సత్యం’ మా క్లాసులో ఉన్నాడని
యాక్టర్ కాలేని యాక్టర్ ‘ సుగుణాకర్’ ఒకరని
‘ సుధా’ అని నేను పిలిచే బోళా ! ‘ సుధాకర్’ అని
మధుర మంజుల ఝరి రవ కంఠం “ మధూకర్’
మంథని వాస్తవ్యుడు నేస్తం ‘ రాజేందర్’
మాష్టర్ కావాలని నేను కోరే ‘రాంసురేందర్’
సహృదయుడు ‘ నాగేందర్’
ఇంకా గాయకుడు కాలేని ‘ కిషోర్’
మరింకో గాయకుడు కాని ‘ రఫీ’
రెడ్డి అనే మిత్రుడు ఒక్క ‘ జనార్దనుడే’ అని
చారి అనే ‘ శ్రీనివాసుడు’
వేములవాడ రాజు అనే ‘ శర్మ’
అందరిలో ఒకే ఒక్క ‘ మనోరమ’
ఇకపోతే ఎప్పుడో వచ్చి ఎక్కడో పోయిన ‘వెంకన్న’
అనే మిత్రుడు వెళ్లిపోయాడని
అందరి ముందు ఖంగున మ్రోగే ‘లక్ష్మీనారాయణ’ నేను
మిత్రుల గురువర్యుల సహస్ర వీక్షణమ్ముల్లో
శ్రీ రాజరాజేశ్వర కళాశాల ఔన్నత్య శిఖరాల్లో
ఎదిగిపోగలనో మిమ్ము చూడమని
ఇక సెలవు .

సబ్బని లక్ష్మీనారాయణ. రిటైర్డ్ జూ. లెక్చరర్

Facebook Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!