Sunday, October 2, 2022
Home > పుస్తక పరిచయం > నీవు పద్య కావ్యం -ఆధ్యాత్మిక తాత్విక ధార!

నీవు పద్య కావ్యం -ఆధ్యాత్మిక తాత్విక ధార!

సాహితీరత్న డాక్టర్ గండ్ర లక్మనరావ్ గారు జగమెరిగిన కవి వతంషులు. తెలంగాణా జిల్లాలో వారి పెరు తెలువని వారు లేరు. తెలుగు సాహితీ క్షేత్రంలో గత నలబై ఏళ్ళ నుండి సాహిత్యంలో వివిధ ప్రకీయాల్లో డజన్కి పైగా రచనలుచేశారు. అంతేకాక విశ్వనాథ వేయిపడగలుపైన సిద్ధాంత పరిశోధన చేసి డిగ్రీ కళాశాల ఆచ్ఛాయులుగా పదవీవిరమణ పొందారు. పద్య వచన కవిత్వంలో, సాహితి వక్రుత్వంలో అందే వేశినా చేయి. తెలుగు సాహితీ క్షేత్రంలో ద్రోణాచార్యుదంతాటి వారు. మా తరానికి గురుతుల్యులు. సాహితి సంస్థలను నడిపించటంలో కొట్టిన పిండి. సాహితి గౌతమి,బొవేరా, పద్య కవితా సదస్సుల నిర్వహణను ఘనంగా నిర్వహించారు. శాతవాహన ఉక్షవాలలో సాహితీ, చరిత్ర సదస్సులను నిర్వహించి విజయవంతం గావించారు. వారు ఇటీవల రాశిన నీవు ఆధ్యాత్మిక తాత్విక చి0తనల పద్యధార ఏంజిల్ జలపాతం లా రమణీయంగా, సరళ0గా ఉంది. నీవు అనే పద్య శతకంలో 111 పద్యాలు ముక్తకాలుగా అల్లారు. ఇవన్నీ భగవంతుడికి సమర్పించిన భక్తి రసాత్మక మలయాళ రూపంలో ని ఉత్పలమాలలు. నిర్గుణాకారుడు,నిరామయుడు, బ్రహ్మ పదార్ధం, మనోహరాకృతిలో నిండిన వాడు, విధాత, నీవే త్రిమూర్తి రూపుడు, మాధవుండు, దశావతారుండు అంటూ పరిపారి గా వివిధ నామములతో సంబోధించి చీకటికి ఆవల ఉన్నవాడిని భగవత్ స్మరణ చేస్తూ హృదయానికి హద్దుకొనే రీతిలో నీవు సంబోధనతో, ప్రారంభ మకుటంతో ప్రయోగాత్మకంగా పద్య కావ్యాన్ని రసవంతంగా తీర్చిదిద్దారు. నీవును నీవటంచుఁ మహనీయుని నిన్నుట చెప్పబూనీతిని!నీవిదియంచు తేల్చుటకు నేను వచింపనెంతవాడ నీ భావన చేసి చూసినే! నీ విధి ఉత్పలమ్ములను నీదు గళమున వేశి మొక్కేదన్!!

నీవుపై శతక పద్యాలు ముక్తకాలుగా వాసిగా రాసినారు. నిన్ను గూర్చి తెలుపుటకు నేనెంత వాడినని నిరాడంబరంగా చెప్పుచు ఆ భగవంతునికి అంకితం గావించారు. నీవు నిరామయుడవు, విరూప చేతనామయుడవు, మనస్సుకు ఏమియు పట్టని విశ్వరూపుడని. ఆస్తికముగా, నాస్తికముగా చెప్పడం కవియొక్క తాత్విక చింతనా పా ట వము అభివ్యక్తమగుచున్నది. 110 పద్యం. నీవు దున్నిన తర్వాత చక్కటి పంట వైనట్లు. నీవు జగములను సృష్టించేవాడివి. ఎంత చేసినా కనిపించనివాడివి.జనులయొక్క గర్వాన్ని తత్వమసిని ఆహాన్నివంచడానికి ఉపయోగపడాలని కవి కోరుకుంటాడు. 107లో. నీవు పద్య రచన వేదాంతసాగర0. నీవు మనోహరడువి, ఎంతోమంది వేలయేళ్ళు వివిధ రీతిలో నామజపాలు చేశారు. సేవలు చేశారు, కీర్తనలను గాని0చారు.నీవు లో అనేక విధాలుగా ప్రశ్ని0చడం కనిపిస్తుంది. కవి భావనాలు పరమేశ్వర తత్వాన్ని వేడడంతో నిండి ఉంటాయి.

డాక్టర్ సినారే నీవును అభినందించారు. గండ్రతనం పద్యాలలో సద్యోటిస్తున్నదని ప్రశంశించారు. పద్యాలలో సరాలత్వం ఉన్న భావ ప్రౌవుడతను సినారే మెచ్చుకొన్నారు. కులపతి శ్రీ భాష్యం విజయసారతి సంస్కృత శ్లోకాలలో ఎత్తుకున్నారు. ఆచార్య రావిక0టి వసునందన్ తెలుగు సంస్కృతాలు కవలలవలె అల్లుకుపోయి సహృదయవేద్యంగా అంతఅంతరాల్లోకి తొంగిచూచే రకంగా పద్యరచన విలక్షణ0గా ఉందని అన్నారు. పరమాత్మ ప్రసంశే కాదు, పరమ స్వతంత్రమైన విమర్శనా దర్శనం కనిపిస్తుందని అన్నారు.

-సంకేపల్లి నాగేంద్రశర్మ, కరీంనగర్, చరవాణి 9441797650.

Facebook Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!