Friday, August 7, 2020
Home > కవితలు > || డైలమా || -అక్షర్ సాహి

|| డైలమా || -అక్షర్ సాహి

నీకో విషయం చెప్పాలని ఉంది.
నీకే ఎందుకో మరి?
నా రహస్యాలు భద్రంగా ఉంటాయనా?
నా మనిషివి అనే స్వార్థం తోనా?

సల సల కాగుతున్న డైలమాలో
కార్యరూపం దాల్చక
కొట్లాడుకుంటున్న కోరికలు
నేనంటే నేనని పొడుచుకుని చస్తుంటే..
ఏడ్చి ఏడ్చి కన్నీటికే కరువొచ్చింది..!

ఆలోచిస్తుంటే అంతుచిక్కని ఆలోచనలు
అనాలోచితంగా అణగదొక్కుతూ…
పరిస్థితులకు రాజీ పడుతూ..
నా ఆశల మీద నీళ్లు చల్లి..
నన్ను అచేతనుడిని చేస్తూ..
దిక్కున్న చోటికి పోమ్మంటే ఎక్కడికి పోను
నా అనిపించే నీ రూపాన్ని వదిలి..!

-అక్షర్ సాహి

Facebook Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!