Wednesday, June 3, 2020
Home > కవితలు > || పాట || -బత్తిని కార్తిక్

|| పాట || -బత్తిని కార్తిక్

పాట

అల్లి రాసేది కాదు….
పాటంటే…
పోల్చి రాసేది కానే కాదు..
పాటంటే…

కలం తో రాసిన కల్పితo
కాదు… పాటంటే…
మనసు పెడితే..
మది రాసే బావం
పాటంటే….

నీటి అలల సవ్వడి…
నీలి గగనం లో
మేఘాలు పోరాడి…
ద్వనిoచే శబ్దమే
పాటంటే…..

పుడమి నుండి జీవం
పోసుకున్న ప్రతి జీవి
గమనం, గమ్యమే
పాటంటే…

నియమం లేని
అనుక్రమసారం కాదు
పాటంటే….
సక్రమైన శబ్దాల స్వరం
పాటంటే…

కోయిలమ్మ కూతలో
చిలుకమ్మ పలుకులో
నాటేసే పొలం మడి లో
పుట్టింది పాట…
గజ్జెల సప్పుల్లకు…
సోపతి అయ్యింది పాట…

వాడకట్టున సుట్టే
బీడీలకు తోడు పాట…

సెలయేరు పారంగా…
శిలలన్ని వినంగా…
అడవితల్లి సాక్షిగా…
పుడమితల్లి హ్రుదయం
పొంగించేటి పాట…

కళాకారుడికి విలువైన
ఆస్తి పాట…
పాటంటే ప్రాస కాదు…
పాటంటే ఒక ప్రశ్న
దాని ఫలితమే స్వేచ్ఛ….

పాట కళ అనే
సముద్రానికి
ఒక తీరం….

పాటంటే ఒక నిత్యప్రవాహం
పాటంటే ఒక పోరాటం…
పాటంటే ఒక ప్రళయం…
పాటే ఒక శబ్దం..
పాటే ఒక అర్దం..

రచన : బత్తిని కార్తిక్
9908052006

Facebook Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!