Saturday, February 22, 2020
Home > కవితలు > || నడుస్తున్నాను || -నాగరాజ్ వాసం

|| నడుస్తున్నాను || -నాగరాజ్ వాసం

నడుస్తున్నాను
తెలిసిన దారే కదా…
కాని ఇదివరకు ఈ దారిగుండా చివరకంటా వెళ్ళ లేదు…
ఆ దారిలో చివరకంటా నడవడం నీ వల్ల కాదని
ఎవరో నిరాశ పరిచారు
చాలా అవాంతరాలు నిన్ను అడ్డుకుంటాయి
ఆ మార్గాన్ని పూర్తి చేసిన వారెవరూ లేరని
అసలా మార్గమే సరైంది కాదని
ఆప్తులన్నారు

ఎవరెన్ని సంశయాలు నాలో నాటినా
అవి నాలో నిరోధించే మొలకలు కాలేక పోయాయి

వెళ్ళాలని నిశ్చయంగా ఉన్నపుడు
సంకల్పమే మనల్ని నడిపిస్తుంది

అదే నన్నూ నడిపించ సాగింది

దారిలో గుచ్చుతున్న ముల్లను పెరికేస్తూ
సాగుతున్నాను….

నడక ఆగడం లేదు
నేనడిచిన నేలంతా శుధ్ధి అవుతూనే ఉంది
కొన్ని నిరాశాగొంతుకలు
నన్ను ఆపడానికి ఏవో అవాకు చెవాకులు
పేలుతున్నారు…..

ఆ మాటలు నన్ను శుద్ధి చెస్తూనే ఉన్నాయి
నా అడుగు సాగుతూనే ఉంది
ఉదయం వైపు
నన్ను తేజోమయంగా మార్చే వెలుతురు వైపు
నాలోని అజ్ఞాన చీకటిని పారద్రొలే జ్ఞనదీపం వైపు
నా అడుగులు సాగుతూనే ఉన్నాయి
చీకటి కమ్మిన నేలని చిల్చుకుంటూ…!

-నాగరాజ్ వాసం

Facebook Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!