Wednesday, January 29, 2020
Home > కవితలు > || అక్షరాలు కొన్నే మరి || -బత్తిని కార్తిక్

|| అక్షరాలు కొన్నే మరి || -బత్తిని కార్తిక్

అక్షరాలు కొన్నే మరి…
లక్షణాలే ఎన్నో….!

గెలుపు ఒకటే…
దానికి అడుగులే ఎన్నెన్నో…!!

రాజకీయం అంత ఒకటే…
దాని రూపాలే ఎన్నెన్నో…!!!

పార్టీ లు కొన్నే ….
ప్రజలకు పరేషాన్లు ఎన్నెన్నో !!

దేశం ఒకటే..
దోపిడీ లే ఎన్నెన్నో…

జీవం మనషూలకు అంత ఒకటే
జీతాలే పాపం ఎన్నెన్నో….!!!

మనుషులు అంత ఒకటే…
మతాలే మరి! ఎన్నో….!!

న్యాయం అందరికీ ఒకటే..
అది పొందే వారికి కష్టలే ఎన్నెన్నో.!

రాజ్యం అంత ఒకటే…
రిజర్వేషన్ లే ఎన్నెన్నో….

విప్లవం అంత ఒకటే…..
వీరుల తల్లుల కడుపు కోతలే ఎన్నెన్నో….

దిక్కులు కొన్నే..!!!
ఏ దిక్కు లేకుండా ఉన్న
జీవితాలే ఎన్నెన్నో…!!!

రచన : బత్తిని కార్తీక్
9908052006

Facebook Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!