Monday, August 8, 2022
Home > కథలు > !!కొంచం నమ్మకమివ్వు అవ్వా !! -పుష్యమీ సాగర్

!!కొంచం నమ్మకమివ్వు అవ్వా !! -పుష్యమీ సాగర్

అకుంఠిత దీక్ష గా తునికాకు ని బీడీ గ చుట్టే పన్లే వడ్డాది మల్లవ్వ. చిన్నప్పటి సంధి ఎర్కైన పని గిదొక్కటే. చిన్నతనాన అవ్వ నాయన ఇంగా అల్లా కాందాన్ అంత గిదే పని. ఇగ మల్లవ్వ ఇల్లేమో గొప్ప చారిత్రిక నేపథ్యం గల బోనగిరి లో సమ్మద్ చౌరస్తా లో మొదటి గల్లీ లో ని ఇంట్ల వుండే… మల్లవ్వ కి చిన్న వయసు లో నే లగ్గం అయింది. పెనిమిటి ఏమో చెర్వు కట్ట కాడి బట్టల మిల్లల పనిజేయ్యవట్టె దినము కూలి గా ఐదేండ్ల సంధి చేస్తున్న్నాగింత గూడ పయిదా లేకపోయే… ఇద్దరు కొడుకులు ఓ బిడ్డ… కొడుకులని బీచ్మహల్లా ఇస్కూళ్ల (గోవేర్నమేంట్) చదివిట్టుంది. ఇగ ఆడ పిల్ల కి సదువెందుకు తీయి అని బీడీల చుట్టుడు నేర్పిస్తాది.. గా పిల్ల కి ఏమో నిండా పది ఏళ్ళు గిట్ల లెవ్వు. మొగుడు పెళ్ళాం ఇద్దరి రెక్కల కష్టం గూడ పేయి నింపటలేదు… గింత లో పెద్ద పోరడు మల్లేషు అచ్చిండు. “అవ్వ, ఓ అవ్వా”: ఇంటున్నావా అన్నాడు, ….బీడీ చుట్టుడు ఆపకుంటేనే “ఏందీ రా మల్లేషు’ ఇస్కూల్ కెల్లి జల్దీ అచ్చినవ్. కిలాసులు సక్కంగా అవుతున్నాయా లేదా ఏంది అని అడిగింది …

“ఆ గంత సక్కంగా నే ఉంది, ఈ సావొచ్చెరం పదికి బోతున్నా” అని నసిగాడు, అయితే ఏమి చేయమంటావ్ రా….ఓ పోల్ల, గా కత్తెర, పుగాకు అందుకో ఇందులో తక్వయింది.
“ఆమ్మో” వింటున్నావా అన్నాడు…. చేసున్న పని ని ఆపకుండానే మల్లవ్వ “వారి గా గంత గనం అరుస్తున్నావు రా ఇనపడింది లే…అయితే ఏమి జెయ్యాలె ”
” నా సోపతులందరు, ట్యూషన్ ల పోతుర్రు, ఇగ పది ల పాసవ్వడు గంత నీ జెతులా నే ఉంది, మల్లవ్వ ఒక్కసారి గా పని ఆపి “అయితే నువ్వు సార్లు సెప్పింది యాదుకు ఉంచుకోవడం లేదా రా వారి !>. అని కొద్దీ గ గట్టిగానే అడిగింది.

మల్లేషు: గది గాదే , గిప్పడి దాకా ఎట్లనో నెట్టుకొచ్చిన ఇగ ఆ ఇంగ్లీష్, లెక్కలు వశపడ్తలేదు, నేను బోను ఇంగా అని మ్నారం జేతున్నాడు.
అవ్వ, ఇస్కూల్ కి బోకా ఏమి జేత్తవు రా…పెద్దోడి ని ఘటనే పది దాకా ఆస్ట్రల్ ల చదివించినా ఆడు చేడు సోపతి బట్టి .. ఎటు గాకుండా పోయిండు …ఆడు సద్విన సదువు కి గ జగదేవ్ పూర్ చౌరస్తా ల పెంకుల ఫ్యాక్టరీ లల్ల పనికి కుదురురా అంటే జేసినట్టే జెసి పాడుకొని అచ్చిండు …నీ చెల్లి ని సదువు జోలికి కూడా పోలె గిప్పుడు బీడీ జుట్టుదు పని నేర్పిస్తున్న పెద్దో డు గట్ల అయ్యిండు నువ్వు గిట్ల ఆగం జెయ్యకురా మల్లేషు.

గందుకనే అవ్వ, గా రెండిట్లో ట్యూషన్ పోతే జెర్ర ఎక్వ మార్కులు వోత్తె పై సధువుల కి పోతా.
మల్లవ్వ: ఏడీకెళ్ళి తెను రా రెక్కలు ముక్కలు జేసుకొని ఎయ్యి బీడీ లు జుడితే రోజుకి నలభై రూపాయలు గిట్ల రాకపోయే గప్పుడు ఎప్పుడో మీ తాత గింత చిన్న కొంప కట్టి పోయిండు గాబట్టి గింత నీడ అన్న ఉంది లేదంటే ఎట్టా..ఇగ మీ అయ్యా ఫ్యాక్టరీ ల పని జేసుడు డైలీ లేబర్ కిందనే జేస్తుండే.
మల్లేషు : అబ్బా అవ్వ గదంతా నాకెందుకు ….ఇగ పోవాలన్నా వద్ద గదొక్కటి జెప్పు.. చేట లోని బీడీల కట్టలని ఒక్కోటిగా పక్కన పెట్టుకొని ఇంట్లోకి పోబోతుంది …పోయేది మల్లేషు కేశి జూసి
“మల్లేషు, మీ అయ్యా తెచ్చేది తక్వ పైసల అందులో తాగుడు కి సగం బోతే ఈ సంసారానికి బొటా బోటి గా సరిపోబట్టే నీకు తెల్వదా, జూస్తూనే వున్నావు గా
మల్లేషు, సరే గేట్లయితే గట్లనే తీయి …అవ్వ, బువ్వ ఆకలి అయితాంది .. పొద్దు కి గింత తిని పోయిన, ఇగ గా సారూ ఇంటికాడికి పోయి వొత్త . బువ్వ తిని సీదా లెక్కలు జెప్పే శ్రీధర్ సారూ తానికి బోయిండు
సార్ నమస్తే, పైలం గున్నరా అని జెర్ర సిగ్గు పడుతూనే అడిగిండు మల్లేషు
శ్రీధర్: ఏమి రా గిట్లొచ్చినావు, సదువుతున్నావా ఇగ ఫైనల్ పరిచ్ఛలు నెల తరువాత షురూ అవుతాయి నువ్వు టెన్త్ ల కొచ్చినవ్ బిడ్డ సక్కంగా సద్వాక్య పొతే ఫెయిల్ అవుతావు ఎరుకైందా
మల్లేషు నసుగుతూ తల కింద కేసిండు
శ్రీధర్ : ఏమైంది రా గట్ల తల వెళాదేశింవు ….ఏమైనా ఫికర్ రా …..జెప్పు …అని జెర్ర గట్టిగ అడిగిండు సారూ
నాకు పది తరగతి ల లక్కలు సమజ్ అవుటలేదు సార్, నా సోపతి గాళ్లనీ అడిగితె గేలి జేస్తున్నారు ..నాకు అయితే ఏడ్పు వస్తుంది …జూడబోతే ఎక్సమ్ దగ్గరకి అచ్చినాయి ..
శ్రీధర్ : మరి హాఫ్ ఇయర్ ల మంచిగానే అచ్చినాయి కదా రా.., అవ్ సారూ, గప్పుడు రాత్రి పూట మీరు జెప్పిన లెక్కన గవి అన్ని ప్రాక్టీస్ జేసినా ఎందుకంటే గప్పటి కె నా సోపతి గాళ్ళు నన్ను గేలి జేస్తున్నారు ..నేను మొద్దు ని ., లెక్కలు రానీ బఠాణీలని ఇవ్వవో జెప్పిర్రు సార్.. ఇగ మీరు జెర్ర జెప్తే నేను బయటపడ్తా …అని ఏడుపు మొఖం పెట్టాడు మల్లేషు
శ్రీధర్;: ఇంగా నెల రోజులే గదా రా ఉంది.. ఆలోచిస్తూ ఉండే పోయాడు సరే లే డైలీ ఒక గంట జెప్తా.. మంచిగా బుర్ర వెట్టి లెక్కలు చెయ్యి సరే నా ,
గా ముచ్చట సారు జెప్పడం తోనే మల్లేషు మొగం వెయ్యి వోల్టాల బల్బ్ మాదిరి వెలిగిపోయింది గుంతలోనే మల్లి నిరాశ అది జూసి అడిగిండు

“మల్లి ఏమైంది రా ఇగ ప్రాబ్లెమ్ సాల్వ్ జేసినా గదా “, మల్లేషు అన్నాడు …”లెక్క లు అయితే లెక్క కుదిరింది, మరి ఇంగ్లీషు గుడ్క మీరే మాట్లాడి పెట్టున్రి సారు. బాంచెన్ అంటూ కాళ్ళు పట్టుకొబోయాడు …

శ్రీధర్: అర్రీ… గిదేమి పని రా కాళ్ళు పట్టుకుంటున్వ్ ….లే లే….ఇంగ్లీష్ సర్ కి గూడ జెప్తాలే .,..మ్మ్ మరి ఎలా రా రెండు క్లాసు లు.. అని కాస్త అలోచించి అన్నాడు “ఓ పని జెయ్యి రా…స్కూల్ అవ్వగానే అదే రా నాలుగు గంటలతరువాత అక్కడే ఉండు నేను ఇంగ్లీష్ సార్ తో మాటాడి ఏర్పాటు చేపిస్తా సరే నా…ఏమి ఫికర్ జెయ్యకు ..

మల్లేషు: కళ్ళ వెంట కన్నీళ్లు కారుస్తున్నాడు.. అది జూసి శ్రీధర్ ., ఎందుకు ర గట్ల ఏడవబడితివి …
మీరు శానా మంచోళ్ళు సారు , ఫీజు గుడ్క తీసుకోకుండా పుక్కట్ల జెప్తున్నరు.. మా అవ్వ ని అడిగిన ట్యూషన్ పోవాలే … ఈ సంవత్సరం ప్యాసు కావాలె అని

శ్రీధర్ : అవుతావు లేరా ఫికర్ జెయ్యకుండా రేపటి నుండి రా పో …అని పంపించాడు శ్రీధర్ వాళ్ళ లెక్కల టీచర్.
మల్లేషు ఇంటికి వచ్చి గింత బువ్వ తిని రేపటి గురించి ఆలోచిస్తూ పడుకుంది పోయినాడు

ఎప్పటివోలె మల్లవ్వ పొద్దుగాల లేచి బీడీ లు చుడుతోంది …చెల్లి ఏమో అవ్వ కి కావలసినవి అందిస్తూ ఇంట్లో పని జేత్తుంది …ఇంతలో ఇసుకూల్ కి పోతున్న మల్లేషు ని ఆపింది

మల్లేషు ..నీ పది ఎప్పుడు అవిపోయితుంది రా, నాతోని వశ పడ్తలేదు ఇంత పెద్ద సంసారాన్ని ఒక్క దాన్ని గేట్ల మోస్తా జెప్పుడు.. నీ పరిచ్ఛలు అయిపోతే ఈ బీడులు జుట్టుడో, లేదు మెకానిక్ జూనీ దగ్గర పని కుదురుసుకొని చెయ్యి
మల్లేషు : అవ్వ, నేను పనికి బోన్ …సదువుకుంటా ఒక్క పాలి మాట వినవె అవ్వ, మంచిగా సదువుకోని నీకు ఈ బీడీల చుట్టుడు కి బందు వెడ్త …నమ్మే.

మల్లవ్వ ఆశ్చర్యం గా నోరు వెళ్ళబెట్టి …”ఏందీ రో గంత భరోసా నా ఏది కెళ్ళి అచ్చిందా రా నీకు” హా
మల్లేషు …గదంతా ఎందుకు తీయి అవ్వ, నాకు ఒక నెల టైం వుంది ఆ నెల లో నేను పది పాస్ అయితే హాస్టల్ ల ఉండి సదువుకుంటా , ఇంగా అప్పుడు అప్పుడు వచ్చి పోతా … దీనికి నువ్వు సరే నా జెప్పు

మల్లవ్వ : సరే తీయి … గది కూడా జూస్త నీ అన్నా ఏమో చదువు సగం లో ఆపి ఊర్ల తిరుగుతుండ్రు కానివ్వు ..
మల్లేషు ఖుషి గా ఇస్కూల్ కి పోయిండు …రోజులు తొందరగా గడుస్తున్నాయి.. ఆ రోజు రానే వచ్చింది పది పరీక్షలు అవి ఫైనల్ ఎగ్జామ్స్ కావడం తో మల్లేషు చాలా శ్రద్ధ గా చదవసాగాడు…. అవ్వ మల్లేషు పట్టుదలకు కొంత అబ్బరపడ్డది …అవ్వ కి కూడా ముచ్చటేసింది …ఒక్కో పరీక్షా ని అద్భుతం గ కాకపోయినా మల్లేషు స్థాయి కే తగ్గట్టే రాసాడు …చివరి పరీక్షా రాసి బయటికి వస్తున్నాడు ఇంతలో సోపతులు కల్సిండ్రు.
రమేష్ : ఏమి రా గేట్ల రాసినావు ….ఎన్ని మార్కులు ఆస్థాయి ..సున్నా నా, పది సున్నాలా అని వెక్కిర్నచాడు.
సురేషు: అర్ పాగల్ గట్ల అంటావేంది రా బయి …నూటికి నూరు మార్కులు అత్తయి అన్న కి
ఇంకా వాళ్ళు అందరు గేలి జేస్తున్నట వశపడక ఏడుసుకుంటే ఇంటి బాట పట్టింది… మధ్యలో శ్రీధర్ సర్ కలిసుండు …”అర్రే మల్లేషు , ఎట్లా రాసిన వ్ పరీక్షలు ప్యాసు అయితే చాలు రా ఇంకేమి వద్దు
మల్లేషు : శ్రీధర్ సార్ కి దండం పెట్టిండు, సార్, మీరు, ఇంగ్లీష్ సార్ నా తోని మంచి గా చదివించుర్రు….మీ నమ్మకాన్ని వమ్ము జెయ్యను సార్…నా శాయశక్తులా ప్రయతించిన ఇగ ఆ తరువాత పై వాడి దయ …

శ్రీధర్ : ఏమి గాదు తీయి …సక్కంగా నే ప్యాసు అవుతావు లే …
మల్లేషు మరోసారి దండం పెట్టి ఇంటికి వెళ్ళాడు ..మల్లవ్వ ఎదురొచ్చింది …బిడ్డ ! మల్లేషు పరిచ్చ బాగా రాసినవా ప్యాసు అవుతావా ….మరి చానా కష్టం గ వుంది అయ్యా తోటి కూలి కి పోతావా అని అడిగింది.
మల్లేషు : అలోచించి …అవ్వ, గిప్పుడు అయితే కూలి కి పోతా…నేను ప్యాసు అయితే మంచి సధువు కి హాస్టల్ లో జేరి మంచిగా సదువుతా ..ఇంకా మనకి కష్టం గాకుండా మంచి ఉజ్జోగం జెసి నీకి బాధ తప్పిస్తా సమాజ్ అయిందా
మల్లవ్వ; ఓర్నీ , గవ్వన్నీ జరగని ముచ్చట్లు లే గాని రేపట్నుంచి పనీలకి పో సరే నా..
మల్లేషు : సరే అవ్వ, నువ్వు జెప్పినట్టే పోతా… అలా మల్లేషు తన తండ్రి తో పాటు గా బట్టల మిల్లు లో కూలి కి కుదిరాడు.. గిర్రున్న రెండు నెలలు గడిచాయి…. పరీక్షా ఫలితాలు రానే వచ్చాయి …వచ్చిన రోజు ఉదయం …
మల్లేషు …ఓ మల్లేషు ఇగ ఓ పాలీ ఇటు రారా నీ కోసం ఏవాళో వొచ్చిన్రు అన్నది మల్లవ్వ
మల్లేషు లేచుకుంటూ గింత పొద్దుగాల నాకోసం ఎవలు వొత్తారు అబ్బా అనుకుంటూ కళ్ళు నులుముకుంటూ బయటికి వచ్చాడు …సూడంగనే శ్రీధర్ సారు, ఇంగ్లీష్ సారు అయిన సంపత్ ఇద్దరు ఇంటి కాడికి వచ్చిన్రు ….ఊకే రాలేదు పేపర్ తో పాటుగా వొచ్చింర్రు …
శ్రీధర్: ఒరే మల్లేషు.. నువ్వు శానా మొండి వాడి రా ,
మల్లేషు బయపడుకుంటా :ఏమైంది సారు నా తోని ఏదైనా గలాత్ అయిందా మాఫ్ జేయ్యుంరి మల్ల , బాంచెన్ …అన్నాడు
శ్రీధర్: ఛీ ఛీ అదేమీ లేదు …ఓ మల్లవ్వ గింత షెక్కర్ ఉంటె నీ కొడుకు నోట్లో పొయ్యి ..ఆడు ఇప్పుడు మామోలుడు గాడు …పది పరిచ్చ లా ఈ మూడు జిల్లాలో నే వాడు ఫస్టు వచ్చిండు ఎరుకైందా అన్నాడు ఖుషి గా ..
మల్లేషు : సారు నిజంగా…..నిజంగానా..నమ్మలేకపోతున్నా అన్నాడు కళ్ళ వెంబడి నీళ్లు దారాళం గా కారుతున్నాయి వెంటనే శ్రీధర్ సార్ కాళ్ళ మీద పడ్డాడు …మల్లవ్వ ఆనందనానికి అంతే లేదు ….
శ్రీధర్: లే రా…..నేను జేసింది ఏమ్లేదు రా ….నువ్వు ఆ రోజు వచ్చి సిగ్గు ని భయాన్ని విడిచి :”చదువుకోవాలి” అన్న తపన ని జెప్పినప్పుడే అనుకున్న నువ్వు ఎదో రోజు అద్భుతాన్ని సాదిస్తావు అని …నా నమ్మకం వొమ్ము కాలేదు ..రా అన్నాడు.
మల్లేషు : అవ్వ, నేను నీకు జెప్పలేదు గదా…ట్యూషన్ పెట్టినమంటే పైసల్ అవుతాయి అని వొద్దు అన్నావు గా .. గప్పుడు శ్రీధర్ సార్ తానా పోయి మొత్తం జెప్పిన…సారు జెయ్యబట్టే నేను గింత సాధించినా… ఇగ నేను పని కి పోను అవ్వ దండం పెడతాయా…
శ్రీధర్ : పని ఏంటి రా …నీకు వచ్సిన ర్యాంకు కి మంచి కాలేజీ ల సీట్ పిలిచి ఇస్తారు ..కానీ పనికి పోమాకు
మల్లేషు ..గట్లనే సారు కానీ మల్లి ఠికానా అది అని నసిగినాడు , ఒరే , కాలేజీ లో సీట్ తో పాటు హాస్టల్ గడ్క వుంటది .. సమాజ్ అయిందా…

ఓ మల్లవ్వ వీడ్ని మంచి గా చదవ నీయి ..నీ ఇలాకా లా నీ కుటంబమం లో వీడోక్కడే తెలివి మంతుడు ..”బీడీ” ల పనికి మాత్రం కుదర్చకు …ఫెయిల్ అయితే అయ్యిండు పైకి రావాలన్న కసి వీడి లో వున్నది …రేపు రేపు నీ వాళ్ళందరి ని సుఖ పెడ్తాడు..ఎరుకైందా …
ఇంకా నేను పోయి వస్తా అని శ్రీధర్ సారు, ఇంగ్లీష్ సారు ఇద్దరు కల్సి వెళ్లిపోయారు …
మల్లేషు …బిడ్డ మంచిది పెద్ద సధువు లు సదివి కొలువు జేశి ..మమ్మల్ని జూసుకో బిడ్డ…అని ఆనందం తో పొంగి పోయింది మల్లవ్వ..
మల్లేషు ..అలాగే అవ్వ, నువ్వు ఫికర్ జెయ్యకు ….అని అవ్వ కళ్ళు తుడిచాడు ..
మల్లేషు ..ఓ పేరు పొందిన కాలేజీ లో ఇంటర్ లో బైపీసీ గ్రూప్ తీసుకున్నాడు ….అక్కడ కూడా కస్టపడి చదవడం తో ఈ సారి స్టేట్ రాంక్ తెచ్చుకున్నాడు …..శ్రీధర్ సర్ సహాయం తో టి ఎంసెట్ కోచింగ్ తీసుకున్నాడు. అక్కడ కూడా కస్టపడి వంద లోపు రాంకు తీసుకొచ్చుకోవడం తో మెడిసిన్ లో సీట్ అల్కా గానే దొరికింది ఉస్మానియా లో ఐదు ఏళ్ళు డాక్టర్ గిరి ని కస్టపడి జదివిండు ..అందులో గూడ గోల్డ్ మెడల్ తీసుకోవడం తో వెంటనే సర్కారు కొలువు కి జాయిన్ అవ్వమని ఆర్డర్ వచ్చింది ….అది కూడా తాను పుట్టిన ఊరికి, తానూ చదువుకున్న ఊరికే రావడం గొప్పగా అనిపించింది నగిరి గవర్నమెంట్ హాస్పిటల్ లా కొలువు కి జాయిన్ అయ్యిండు.. మొదటి సారి డ్యూటీ కీ పోయి ఇంటికి వచ్చ్గాడు.
మల్లేషు : అవ్వ, నువ్వు ఆ దినం నెల రోజుల పరీక్షా కీ అనుమతి యవ్వకుండా ఉంటె నేను కూడా ఇదే “కూలి” గా ఉండేవాడిని గధ …చదువుకుంటే నా కుటంబాన్ని కాదు దేశాన్ని కూడా బాగు చెయ్యొచ్చు కదా..
మల్లవ్వ: అవును కొడ్క, ఇంకా నా కస్టాలు అన్ని తీరని… బీడీ లు చుట్టి, పొగాకు ఆసన పడక దగ్గు రా బిడ్డ..ఏమి జేతును ..
మల్లేషు :ఇంకా నిన్ను కష్టపెట్టను అవ్వ, రేపటినుంచి నువ్వు బీడీలు జేసుడు బందు వెట్టు, గట్లనే నాయన ని కీ గూడ జెప్పు ఫ్యాక్రి పని ఆపు జెయ్యమని. చెల్లి కీ మంచి గ సదివిపిస్తా…. ఇంకా అవన్నీ జూసుకుంటా తీయి. అని భరోసా ఇచ్చాడు …..

మల్లవ్వ తన కొడుకు కీ ఇచ్చిన నమ్మకం కొద్దీ గా అయినా మల్లేషు పట్టుదల తో ముందుకు సాగాడు ….స్నేహితుల హేళన తో తనలో రోషం పొడుచుకు వచ్చి తానేంటో నిరూపించుకోవాలని తపన పడ్డాడు… లెక్కల మాస్టారు దగ్గర ట్యూషన్ చదివి పది తరగతి నుంచి నుంచి డాక్టర్ దాకా ఎదిగిన ప్రస్థానం చిన్నదేమీ కాదు …ఏ పనైనా కస్టపడి కాదు ఇష్టపడి చెయ్యాలి ..అలా చేసాడు కాబట్టే ఈ రోజు మల్లేషు ఈ సమాజం “కూలి” గా కాకుండా డాక్టర్ గా మన ముందుకు వచ్చాడు …మల్లవ్వ లాంటి తల్లి ప్రోత్సహం ఉంటె ఈ దేశం లో చాలా వరకు స్కూల్ డ్రాప్ అవుట్ లు తగ్గుతాయి …ఆలోచించండి …పిల్లలకి కొంచం నమ్మకం ఇవ్వండి ..తరువాత వారే మీకు అద్భుతాలు చేసి చూపిస్తారు …

సెలవు ..
మీ
-పుష్యమీ సాగర్

Facebook Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!