Saturday, May 30, 2020
Home > కవితలు > ||బతుకేదమ్మా || -ఫణి మాధవి కన్నోజు

||బతుకేదమ్మా || -ఫణి మాధవి కన్నోజు

బతుకమ్మా… వచ్చుడు పోవుడు అయ్యిందా అమ్మా…
బతుకు బతికించు నీ మాట కదమ్మా..
ఏ అమ్మకు బతుకు నిచ్చి పోయినవ్ అమ్మా…

పసిదాని బతుకు కోరిన అమ్మ కండ్లలో ఊపిరి ఆవిరైపాయె…
మరో పసిదానికి జన్మనిచ్చేటందుకొచ్చిన అమ్మ దవాఖానా గుమ్మంలోనే మరో మరణానికి పురుడువోసె…

అడవిలోని ఆడబిడ్డ అక్షరమంటక అమాయకంగా అట్లనే ఉండె…
అక్షరమొచ్చిన ఆడపిల్ల ఆధునిక అరణ్యంలో అంతమొందె..

అడుగడుగున అలసత్వం రక్షణ కరువాయె..
నిర్భయంటూ అభయమిచ్చినా… నిరాశే మిగిలిపాయె…

ఆధునికపు లోకంలో ఆడపిల్ల ఆటబొమ్మ
ఆదమరిస్తే అత్యాచారం.. అగాధాన పాతేసే అవమానం…

ఆడవాళ్ళ బిల్లేమో అమాత్యుల చేతుల్లో

బతుకు కోరతమంటూ బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటె..
బతుకు కోరె అమ్మ బతుకు అట్లనె ఉండె…

చీరె సారె పరమాన్నాలడగట్లేదమ్మా..
అక్షరం ఆరోగ్యం ఆకలి తీర్చే మార్గం..
ఆడపిల్ల బతుకు నిలిచే మార్గం..

~ ఫణి మాధవి కన్నోజు ~

Facebook Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!