Saturday, February 22, 2020
Home > కవితలు > || చంద్రుడు లేని వెన్నెల || -మాధవ్ గుర్రాల

|| చంద్రుడు లేని వెన్నెల || -మాధవ్ గుర్రాల

ఈరోజు పున్నమి కాదు కదా….!
మిరిమిట్లు గొలిపే
ఈ కాంతి ఎక్కడిది….?
నాది భ్రమ కాదు కదా….!
నా కళ్ళు
నన్ను మోసం చేయడం లేదు కదా….!
ఈ వెలుగులు చూసి
పులకరిస్తుంది నా మనసు
కానీ,
భయం కూడా కల్గుతుంది నాకు
నాకే కనిపిస్తున్నయేమో
ఈ ధవళ కాంతులని
కాదు…కాదు
నిజమైన ప్రకాశమే…!
చంద్రుడు కూడా సిగ్గుపడేలా
నేలపై పరచుకున్న ప్రభలు
నా ఆడపడుచులు
ఆనందంగా ఆడుతున్న
బతుకమ్మ ఆటలలో …
వారి ముఖాల్లో విరబూసిన
సంతోషపు హరివిల్లుల వెలుగులే ఇవి
ఈ భువిపై ఆరబోసిన
వెలుగుల జిలుగులు…

-మాధవ్ గుర్రాల

Facebook Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!