Thursday, April 22, 2021
Home > కవితలు > || నడిపించే శక్తి || -నాగరాజ్ వాసం

|| నడిపించే శక్తి || -నాగరాజ్ వాసం

నడుస్తున్నాను
నిన్ను చూడాలని
దారులన్ని కలియదిరుగుతున్నాను
ఏ దారిలోనైనా కానరాక పోతావా నని

వెతుకుతున్నాను
ఎందులో నువ్వున్నావో నని
చెట్టు పుట్ట
కొండా కోన
వాగు వంక లన్ని
వెతుకుతున్నాను
నీ జాడ కానరాక పోతుందా యని

నడక సాగుతూనే ఉంది
వెతుకులాట ఆగడం లేదు
నీ ఉనికి కోసం, నీ రూపం కోసం

ఎంత వెతికినా కానరావు
ఎంత నడిచినా ఎదురు రావు
ఆకలి లేదు
దప్పిలేదు
అలసటలేదు
ఆయాసంలేదు

నీ మాయ నన్ను ఆవహించి ఉంది
నీ ధ్యానం నన్ను లాక్కెల్లుతుంది

నీ ధ్యాసే తప్ప మరో ఊసు లేదు
ఏదో తెలియని శక్తి
ఏదో తెలియని
ఆనందం

దిగంబరా
ఆదిమధ్యాంతరహితా
తెలుసుకోలెక పోయానయ్యా
నన్ను నడిపించే శక్తివి
నువ్వని
గుర్తించలేక పొయానయ్యా
ఈ విశ్వంలో అనువనువూ నువ్వనీ..!

-నాగరాజ్ వాసం

Facebook Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!