Wednesday, January 26, 2022
Home > కవితలు > || రియల్ హీరో || -మాధవ్ గుర్రాల

|| రియల్ హీరో || -మాధవ్ గుర్రాల

చిటికెన వేలు పట్టుకొని

నడిపించే వేళ తెలియలేదు

నా భవిష్యత్తుకు

బంగారు బాట వేస్తున్నావని…

తప్పుటడుగు వేసినపుడు

తప్పటడుగుగా ఓదార్చి

చాటుగా నీవు పడ్డ వేదన

ఎలా మరువను….?

గుప్పెడంత గుండెలో

కష్టాల కడలి ఉప్పొంగినా….

కష్టాన్ని ఇష్టంగా మార్చుకొని

విశ్వమంత ప్రేమను పంచావు

కళ్ళలోంచి

ఉబికి వస్తున్న కన్నీటిని

ఆనందభాష్పాలుగా మార్చి

మమ్మానందింపజేశావు

సమాజంలో నా ఉనికికై

నీవు పడ్డ తపన

ఎన్ని తపస్సులతో పోల్చుకోను….?

నీ గుండెలపై

ఆడినపుడు గ్రహించలేదు

అందులో నాపై ఉన్న ప్రేమను

ముక్కోటి దేవతలున్నా

నా హృదిలో ప్రతిష్టించింది నిన్నే….

ఏమివ్వగలను నాన్నా….

నా సంతోషాన్ని

అంకితమివ్వడం తప్ప

అప్పటికీ….ఇప్పటికీ….ఎప్పటికీ….

మా రియల్ హీరోవి నువ్వే…..

-మాధవ్ గుర్రాల

Facebook Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!