|| నేను.. కార్టూనులు.. లవ్ ఎఫైర్స్ || – రెండవ భాగం – “నేను ఒక బోర్ టూనిస్టుని” -నాగరాజ్ వాసం
డిగ్రీ పరీక్షలు రాసి వెంటనే రెడీమేడ్ డ్రెస్సెస్ షాప్ పెట్టుకోవడం ,వ్యాపారంలో మునిగిపోవడం, పది సంవత్సరాలు చకచకా కదిలిపోవడం జరిగిపోయాయి. ఆ పది సంవత్సరాలు నా జీవితంలో వ్యాపారం డబ్బుతప్ప మరో విషయానికి తావులేదు. కనీసం బంధువులు,పండగలు,దోస్తులు, ఆనందాలు అనే మాటలకు జాగాలేదు. 2008లో ఇల్లు కట్టుకోవడం ,పెళ్లిచేసుకోవడంతో ఆలోచన ధోరణిలో కొంత మార్పు. మానసుపొరల్లో మగ్గిన కార్టూను విత్తనాలు మొలకెత్తడం ఆరంభించాయి. ఆంధ్రభూమి వార పత్రికకు పది కార్టూనులు పోస్టుకార్డు సైజులులో వేసి పంపించాను. 25రూపాయల
Read More