Monday, August 8, 2022
Home > కథలు (Page 2)

బొజ్జ గణపయ్య- భూలోక యాత్ర! -అక్షర్ సాహి

"స్వామి.. మహా గణపతి..! మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ అఫ్ ది డే!" "థాంక్యూ మూషికా.! ఏమిటి సంగతి పొద్దున్నే ఇంగ్లీష్ లో.." "ఏంలేదు స్వామీ ఈరోజు మనం భూలోకం వెళ్తున్నాం కదా అక్కడ అన్ని భాషలు మాట్లాడాలి కదా. అందరికి ఆమోదయోగ్యం అయిన ఇంగ్లీష్ వాడకం ఎక్కువ కదా అందుకే ప్రాక్టీస్ చేస్తున్నా.." "సరే సరే అన్ని సరిగ్గా సర్దిపెట్టు. పోయిన సారి తీస్కువచ్చిన వస్తువులెవ్వి పెట్టకు. అన్ని భూలోకంలోనే తీసుకుందాం". "అలాగే స్వామి.

Read More

నాన్నా! నా బంగారు కొండా! -వి. సునంద

నాన్నా! చందూ! నా బంగారు కొండా! నీ క్షేమమే ఊపిరిగా బతికే మీ అమ్మను. ఇంట్లోనే వుంటూ, ఇలా ఉత్తరం రాయడమేమిటా అని ఆశ్చర్య పడుతున్నావు కదూ.. నీకెలా చెప్పాలో తెలియక ఈ మార్గం ఎంచుకున్నాను. కన్నయ్యా! నిన్నెంత అల్లారుముద్దుగా చూసుకుంటున్నామో నీకు తెలుసు. నీవు కోరింది క్షణాల్లో నీ కళ్ళముందుంచాం.. నీ స్నేహితుల ముందు తక్కువ కాకూడదని పాకెట్ మనీ కూడా ఇస్తున్నాం. పెద్ద కార్పోరేట్ స్కూల్లో చదివిస్తే బాగా వస్తుందని లక్షలు

Read More

మనసున మనసై! -స్వాతీ శ్రీపాద

“ఎన్నేళ్ళ తరువాత ఇల్లంతా ఇంత హడావిడిగా ఉంది అమ్మగారూ.. మీ ఇంటికి పెద్దకళ వచ్చేసి౦ది” ఉప్మాపోపులోకి దొడ్లో కరివేపాకు తీసుకొచ్చిన సావిత్రితో అంది వంట మనిషి కల్యాణి. నిజమే. ఎప్పుడో పిల్లలు చదువుకునే రోజుల్లో ఎంత హడావిడిగా ఉ౦డేది? ముగ్గురు పిల్లలతో ఉదయం ఎనిమిదికల్లా వంట, బాక్స్ లు రెడీ చెయ్యడం హడావిడి పరుగులు.. వాళ్లటు వెళ్ళగానే స్నానం చేసి ఆఫీస్ కి వెళ్ళడం. ఒకరి వెనక ఒకరు

Read More

కొంచం మనసు పెడితే…! -వి. సునంద

వాడిని. చూడాలి ఎలా వున్నాడో.....తహ తహ లాడింది మనసు. వాడి చెల్లి పెళ్ళి కార్డు చూడగానే వెంటనే ప్రయాణమయింది సుకన్య.. బస్సులో కూర్చుందే గానీ మనసు గతంలోకి పరుగెత్తింది.... చిరుమర్రి ప్రాథమిక పాఠశాల కు బదిలీ పై వచ్చింది సుకన్య... అక్కడంతా వ్యవసాయ కూలీ కుటుంబాలేనని తెలుసుకుంది.. ఆ రోజు బడిలో ప్రవేశించ బోతున్న రోజు.. అక్కడి పిల్లలు పెద్దలు ఎలా వుంటారోనని ఆలోచిస్తూ బస్సు దిగి నడుస్తోంది. ఇంతలో ఓ చిన్న రాయొచ్చి నుదుటికి తాకే

Read More

క్షమయా! -వి. సునంద

మమ్మీ! నా పింక్ డ్రస్ తీసిపెట్టు స్నానానికి వెళ్తున్నా! గట్టిగా కేకవేస్తూ బాత్రూం లో దూరింది సౌందర్య. టిఫిన్లు, కూరలు తయారుచేసే హడావిడి లో వున్న శ్యామలకు కూతురు మాటలతో కోపం నషాళానికి అంటింది. కానీ ఏమీ చేయలేని నిస్సహాయ స్దితి తనది.... ఏమైనా అంటే కూతురి ముందే తిట్ల దండకం మొదలెడతాడు భర్త కామేశం... పంటి బిగువున కోపాన్ని అగ్ని పెట్టి షెల్ఫ్ లోంచి డ్రస్సు తీసి గదిలో పెట్టేసి వచ్చింది... "ఏయ్..!

Read More

కోకిల! -వి.సునంద

“కరుణించు ఓ దేవా! నడి సంద్రములోనా.. పయనించే నా నావ”.....“నీ కొండకు నీవే రప్పించుకో ఆపద మొక్కులు మాటతో ఇప్పించుకో”...ఒకదాని తర్వాత మరొక పాట రాగయుక్తంగా పాడుతుంటే ఆ పాటల తరంగాలు రైలు పెట్టెలోని అందరి వీనులకు విందు చేస్తున్నాయి…. మనిషి కంటే ముందే పాట తనను పరిచయం చేసుకుంటూ పాడే అమ్మాయి ఎలా వుందో ఊహించుకోమని మనసుకు చెబుతోంది...ఆం ఎలా వుంటుంది చింపిరి జుట్టు మాసిన బట్టలు చూడగానే జాలి

Read More

ప్రిస్క్రిప్ షన్ -స్వాతీ శ్రీపాద

మగత మెలుకువ కాని స్థితిలో గోడవైపు తిరిగి కళ్ళు మూసుకుని పడుకు౦ది శ్రీజ. కడుపులో నొప్పి కన్నా మనసులో బాధే తీవ్రంగా వుంది. వేసుకున్న టాబ్లెట్ వళ్ళ అంతగా నొప్పి తెలియక పోయినా అదో విధమైన నీరసం, నిస్పృహ. ఇప్పుడో ఇహనో చంద్ర కూడా వచ్చేస్తాడు. అతని మొహం ఎలా చూడాలి. ఏమని చెప్పాలి? పదిరోజులను౦డీ ఊహల్లో తేలిపోతున్నాడు.

Read More

మన కోసం బతుకుదాం ఇకనైనా! -వి.సునంద

ఏవండీ! వింటున్నారా! మిమ్మల్నే! భోజనం చేసి కుర్చీలో కునుకిపాట్లు పడుతున్న మాధవరావును పిలిచింది సులోచనమ్మ. అబ్బా! ఏమిటోయ్? విషయమేమిటో చెప్పు వింటూనే వున్నా! మాగన్నుగా పట్టిన నిద్రను పాడు చేసినందుకు కొద్దిగా విసుగ్గా అన్నాడు. చిన్నోడు మనల్ని రమ్మంటున్నాడు కదా! ఆ విషయం ఏమాలోచించారాని అడుగుతున్నా! పక్కనే వున్న బల్లెపీట కూర్చుంటూ అంది. ఏమిటోయ్ ఆలోచించేది! వాడికి నేనెన్నిసార్లు చెప్పినా నీతో చెప్పి ఒప్పించాలని చూస్తున్నాడు. ఆ ఉరుకులు పరుగుల వాళ్ళ జీవితంలో స్పీడ్

Read More

సహ జీవనం! – స్వాతీ శ్రీపాద

అబ్బో అప్పుడే వేసవి వచ్చేసినట్టు౦ది. ఫిబ్రవరిలోనే ఎండలు మండిపోతున్నాయి. లంచ్ తరువాత క్లాస్ కి వెళ్లి వచ్చేసరికి గోటు ఆరిపోయింది. బాటిల్ తీసుకుని నీళ్ళు తాగి కొంచం విశ్రాంతిగా కుర్చీలో వాలి కళ్ళు మూసుకునే లోగా ఫోన్ బజ్. ఎప్పుడూ పక్క వారికి ఇబ్బందని వైబ్రేషన్ లో పెట్టుకుంటాను. ఈ సమయంలో కాల్ చేసేది వైదేహి ఒక్కతే, "హలో చెప్పు వైదూ" అన్నాను. “అమ్మా రేపు సెలవు తీసుకో, సాయంత్రం ఇంటికి వస్తున్నాను” మరో

Read More

హర్టయ్యావా…అమ్మమ్మా…?! -వి.సునంద

అన్నపూర్ణ మనసు పురివిప్పిన నెమలిలాగుంది..కాలు ఒక చోట కుదురుగా నిలవడం లేదు. అమెరికా పోయొచ్చిన దాని కంటే ఎక్కువగా సంతోషపడుతున్న భార్యను చూసి, నారాయణ రావు కూడా అందులో పాలు పంచుకుని ఆనంద పడుతున్నాడు… అంతే కదా ..పెళ్ళినాడు మర్యాదలు, పెట్టుబోతలు సరిగా లేవని తమ అంతస్తుకు తగ్గట్టుగా చూడలేదని వియ్యాలవారితో పాటు అలిగిన అల్లుడు..మూడు నిద్రలు ముచ్చట్లేమీ లేకుండానే కూతురిని తీసుకొని పోయాడు… పురుళ్ళు పుణ్యాల అవసరాలకు అన్నపూర్ణను మాత్రమే పిలిపించుకుని పిల్లలకు

Read More
error: Content is protected !!