వాటికే మాటలొస్తె ! – హుమాయున్ సంఘీర్
ఆశయపు వూపిరిలో నిత్యం నా రక్తం కాగుతూ ఉచ్వాస నిఛ్వాసమౌతుంది కలల సాకారపు బాటలో నా అవసరాలు ఎండిన మల్లె మొగ్గల్లే రాలిపోతుంటాయి నేను నా నిస్పృహలో పచ్చని చిగుర్లేస్తుంటాను బక్క చిక్కిపోతూ ఎండిన డొక్కల్లోంచి ఆర్తనాదాలేస్తూ ఆశలు ఎప్పుడూ నామీద అలుగుతుంటాయి కోరికలు బుంగమూతి పెట్టుకుంటాయి ఒక్కోసారి కోపంగా నన్ను నిలదీస్తుంటాయి నా చేతగాని తనాన్ని రంగులు మారి వెలిసి పోతున్న సంకల్పాన్ని నానుండి ఎలాగైనా దూరం చెయ్యాలని కంకణం కట్టుకొని మరీ ఇలా ప్రశ్నలు సంధిస్తుంటాయి ఎందుకయ్యా బోడి నీ ఆశయపు దండెం మీద మమ్మల్ని కోసేసి చేపల్ని ఎండబెట్టినట్టు ఎండబెడతావ్ ? ఛ.. నీకన్నా అదిగో వాడు నయం దొరికిన పని చేస్కుంటూ పైసా వెనకేస్తూ మేమెప్పుడు ఉబికొచ్చినా మామీద
Read More